కథల విషయంలో స్టార్ హీరోలకు భయం పెరుగుతోందా?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం తాము హీరోగా తెరకెక్కుతున్న ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కాలని ఆ సినిమాతో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు. ఈ రీజన్ వల్ల హీరోలు, దర్శకనిర్మాతలు పాన్ ఇండియా నేటివిటీ ఉన్న కథలపై దృష్టి పెడుతుండటం గమనార్హం. అయితే పాన్ ఇండియా కథల వల్ల సినిమా స్క్రిప్ట్ లు, షూటింగ్ లు ఆలస్యం అవుతుండటం అవుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ప్రతి సినిమా కనీసం మూడేళ్ల పాటు షూట్ జరుపుకుంటుంది.

అయితే చాలామంది దర్శకులు రాజమౌళిని ఫాలో కావాలని భావిస్తుండటం గమనార్హం. కథల విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు ఒకింత భయం పెరుగుతోంది. ఎలాంటి కథను ఎంచుకుంటే సక్సెస్ దక్కుతుందనే ప్రశ్నకు హీరోలకు సమాధానం దొరకడం లేదు. సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వేగంగా సినిమాలలో నటిస్తున్నారు. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలైన ప్రభాస్, తారక్, బన్నీ, మహేష్, పవన్, చరణ్ మాత్రం నిదానంగా సినిమాలలో నటిస్తున్నారు.

కొంతమంది యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఈ సమస్యను అధిగమించడానికి ఒకే సమయంలో రెండు కంటే ఎక్కువ సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇతర భాషల్లో టాలీవుడ్ స్టార్స్ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల ఫలితాలకు అనుగుణంగా నిర్ణయాలను కూడా మార్చుకుంటున్నారు. 2023లో దాదాపుగా అందరు టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉండగా

ఈ హీరోలలో ఎంతమంది హీరోలు సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ హీరోలకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. టాలీవుడ్ హీరోల పారితోషికాలు కూడా ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉన్నాయి. టాలీవుడ్ హీరోలు ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. అయితే సమయాన్ని సరైన విధంగా వినియోగించుకునే విషయంలో మాత్రం టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా ఇమేజ్ వల్ల నష్టపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus