టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాలు (Pan India Movies) వరుస కట్టబోతున్నాయి. 2025లో చాలామంది హీరోలు ఇలా కొత్త అవతారంలో రాబోతున్నారు. దీంతో ఈ ఏడాదిని తెలుగు సినిమాలో పాన్ ఇండియా సంవత్సరం అని పిలుచుకోవచ్చు అని చెబుతున్నారు. ఎందుకంటే ఒక్కో సీజన్‌లో ఒక్కో తెలుగు పాన్ ఇండియా సినిమా రాబోతోంది. అయితే ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారు అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాదిలో టాలీవుడ్ నుండి రాబోతున్న తొలి పెద్ద సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) పాన్ ఇండియానే.
రామ్ చరణ్(Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 10న సినిమాను తీసుకొస్తుననారు. నాగచైతన్య (Naga Chaitanya) – సాయి పల్లవి (Sai Pallavi) – చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తండేల్’ (Thandel) ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఇండియా – పాకిస్థాన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియానే. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాను క్రిష్ (Krish Jagarlamudi) – జ్యోతికృష్ణ (Jyothi Krishna ) ఇండియా లెవల్‌లో అదిరిపోయేలా తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా తొలిపార్టుల మార్చి 28న విడుదలవుతుంది.
గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) – విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ అవుతుంది అని చెబుతున్నారు. తెలుగు సినిమాగా ప్రారంభమైన ‘ది రాజా సాబ్’ (The Rajasaab) ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిపోయింది. ఇక పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘ఓజీ’ (OG Movie) గురించి ఈ లిస్ట్‌లో మాట్లాడకపోతే కరెక్ట్ కాదు. పవన్ – సుజీత్ (Sujeeth) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఆ లెవల్‌లో రిలీజ్ అవ్వబోతోంది. అనుష్క(Anushka Shetty) – క్రిష్ ‘ఘాటీ’ని (Ghaati) కూడా అదే రేంజిలో రిలీజ్ చేస్తున్నారు.
హనుమాన్(Hanu Man) తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకుని తేజ సజ్జ (Teja Sajja) చేసిన ‘మిరాయ్’ (Mirai) విషయంలో పీపుల్స్ మీడియా రాజీపడటం లేదు. మంచు విష్ణు (Manchu Vishnu) ‘కన్నప్ప’ (Kannappa) సినిమా కూడా ఈ జాబితాలోనిదే. ‘అఖండ 2’తో (Akhanda 2) బోయపాటి (Boyapati Srinu) – బాలయ్య (Nandamuri Balakrishna) ఈ సారి దేశం మొత్తం పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘సంబరాల ఏటిగట్టు’ (SYG) పాన్ ఇండియా మెటీరియల్ అని రీసెంట్ ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. ఇవి కాకుండా ‘దేవర 2’, ‘సలార్ 2’ ఈ ఏడాది వస్తాయో లేదో తెలియదు వస్తే అలాంటి సినిమాలే ఇవీ.