పంచనామ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్ పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో  నిర్మించిన చిత్రం పంచనామ. ఈ పంచనామ టైటిల్ తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి చేతుల మీదగా విడుదల చేశారు.ఈ సందర్భంగా*

దర్శకుడు సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ *  ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటు ఈ కథ విని నన్ను నమ్మి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా వెన్ను తట్టి నడిపినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక వర్గానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

నిర్మాతలు మాట్లాడుతూ : ఈ చిత్రాన్ని కథ లోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందని ఆ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అర్థమైంది. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం అని తెలియ జేస్తున్నాము. మా ఈ ఫస్ట్ లుక్ కి ఇంతటి ఆదరణ తీసుకొచ్చిన పి ఆర్ ఓ మధు గారికి మరియు ఆయన టీం కి ధన్యవాదాలు .

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus