Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?
- June 23, 2025 / 10:34 PM ISTByPhani Kumar
అర్జున్ అంబటి (Arjun Ambati).. ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అతను హీరోగా ‘పరమపద సోపానం’ (Paramapadha Sopanam) అనే సినిమా రూపొందింది. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాత.
Paramapadha Sopanam
పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) శిష్యుడు అయినటువంటి నాగ శివ (Naga Siva) ఈ సినిమాకి దర్శకుడు.’ఈగల్’ (Eagle) వంటి పెద్ద సినిమాకు పనిచేసిన డేవ్ జాండ్ సంగీత దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా జూలై 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. అందుకే ప్రమోషన్స్ డోస్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ ‘భూమ్ భూమ్’ వంటి లిరికల్ సాంగ్స్ ని రిలీజ్ చేసింది.

ఇందులో ‘చిన్ని చిన్న తప్పులేవో’ సాంగ్ బాగా వైరల్ అయ్యింది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో టీజర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. టాలీవుడ్ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ‘పరమపద సోపానం’ టీజర్ ను లాంచ్ చేయడం జరిగింది.

ఇందులో భాగంగా అర్జున్ అంబటి (Arjun Ambati) చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘నాగ శివ నాకు ఈ కథ చెబుతున్నప్పుడు.. హీరో ఎలివేషన్స్ అన్నీ పూరి (Puri Jagannadh) గారి స్టైల్లో అనిపించాయి.సినిమాలో ఆయన డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి. ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ‘పరమపద సోపానం’ టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తో అన్ని ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి వదిలారు. మీరు కూడా ఓ లుక్కేయండి :













