ఎంపీ రాఘవ్ తో ఏడడుగులు నడవడానికి సిద్ధమైన పరిమితి!

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చడ్డా గత కొద్ది రోజులుగా చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. ఈ క్రమంలోని వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు వస్తున్నాయి. ఇలా వీరి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలను వీరిద్దరూ ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇలా ఈ వార్తలను ఖండించకపోవడం పక్కన పెడితే శనివారం రాత్రి వీరిద్దరు నిశ్చితార్థం జరుపుకునీ అందరికీ షాక్ ఇచ్చారు.

బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరిణితి రాజకీయ నాయకుడు అయినటువంటి రాఘవ్ అనే వ్యక్తితో శనివారం సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. వీరి నిశ్చితార్థం ప్రముఖ సినీ రాజకీయ నాయకుల సమక్షంలో ఎంతో ఘనంగా ఢిల్లీలో నిర్వహించారు. ఇక వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పరిణితి చోప్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు.అయితే వీరిద్దరిది పెద్దలు కుదిరిచిన వివాహం అని తెలుస్తుంది. ఇక వీరి వివాహం ఫిక్స్ అయిన తర్వాత వీరిద్దరూ లంచ్ డేట్ కు బయటకు రావడం,అలాపలుమార్లు కెమెరా కంటికి కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఏమాత్రం స్పందించలేదు కానీ ఇలా ఏకంగా నిశ్చితార్థపు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో సెలబ్రిటీలు అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బాలీవుడ్ సమాచారం ప్రకారం వీరిద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కలిసి చదువుకున్నారని ఇలా స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ప్రేమలో పడటం వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో ఏడడుగులు వేయబోతున్నారని తెలుస్తుంది. ఇక పరిణితి సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా.. రాఘవ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఇలా స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే పెళ్లి విషయాలు మాత్రం ఈ జంట ఇంకా రివీల్ చేయలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus