కాజల్ హాట్ సీన్ పై వివరణ ఇచ్చిన దర్శకుడు..!

బాలీవుడ్ భామ కంగ‌నా ర‌నౌత్ న‌టించిన సూపర్ హిట్ చిత్రం `క్వీన్‌`. బాలీవుడ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక `క్వీన్‌` తెలుగు రీమేక్‌ ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. త‌మిళ రీమేక్‌ `పారిస్ పారిస్‌` లో కాజ‌ల్ న‌టిస్తుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్లను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో కాజల్ నటించిన `పారిస్ పారిస్‌` టీజర్ వివాదాస్పదంగా మారింది. ఈ టీజర్ చివర్లో వచ్చే ఓ వివాదాస్ప‌ద స‌న్నివేశం ఉండ‌డ‌మే దీనికి ప్రధాన కారణం.

వివరాల్లోకి వెళితే.. `పారిస్ పారిస్‌` ట్రైలర్ చివర్లో వచ్చే సీన్ కొంచెం లెస్బియ‌న్ త‌ర‌హాలో సాగడం, ఆ సన్నివేశంలో కాజ‌ల్ న‌టించ‌డం వివాదాల‌కు కార‌ణ‌మైంది. తాజాగా ఈ వివాదం పై స్పందించాడు ఆ చిత్ర దర్శకుడు అర‌వింద్. ఈ విషయం పై అర‌వింద్ మాట్లాడుతూ `ట్రైల‌ర్‌లో ఉన్న చిన్న బిట్ వ‌ల్ల అది మీకు త‌ప్పుగా క‌న‌బ‌డి ఉండొచ్చు. దయచేసి అప్పుడే అందులో త‌ప్పులు వెతక్కండి. సినిమాలో ఆ సీన్ ఏమీ త‌ప్పుగా అనిపించ‌దు. హిందీ ఒరిజిన‌ల్‌లో కూడా ఆ సీన్ ఉంది. ఆ సీన్‌కు ప్రాధాన్యం ఉండ‌డం వ‌ల్లే మేము కూడా ఇందులో చేర్చాము` అంటూ వివరణ ఇచ్చాడు దర్శకుడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus