Paruchuri Gopala Krishna: పరుచూరి వెంకటేశ్వర రావు షాకింగ్ లుక్ పై తమ్ముడు గోపాలకృష్ణ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ రైటర్స్ లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పరుచూరి బ్రదర్స్ కు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. అందులో వెంకటేశ్వర రావు గారు పెద్దాయన. ఇటీవల ఈయనకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. జయంత్ సి పరాన్జీతో ఆయన దిగిన ఫోటోలో ఆయన గుర్తుపట్టలేనంతలా కనిపించారు. చెప్పాలంటే అందులో ఆయన లుక్ భయపెట్టే విధంగా ఉందని చెప్పాలి.

Click Here To Watch NOW

ఆయ‌న అనారోగ్యం క్షీణించడంతో ఇలా మారిపోయి ఉంటారు అని అంతా అనుకుంటున్నారు.పరుచూరి వెంకటేశ్వర రావు గారు రైటర్ మాత్రమే కాదు మంచి నటుడు కూడా..! నటుడిగా ఆయన ఎన్నో మంచి పాత్రలు పోషించారు. అలాంటి వ్యక్తి లుక్ అలా మారిపోవడంతో అభిమానులు పడటం సాధారణమే. తాజాగా ఈయన లుక్ పై ఆయన తమ్ముడు గోపాలకృష్ణ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “కంగారు పడకండి అన్నయ్య బాగానే ఉన్నారు. ఆయన లుక్ చూసి చాలా మందిలో టెన్షన్ మొదలైంది.

విషయం ఏంటంటే..2017లో ఆస్ట్రేలియా వెళ్లి వ‌చ్చాక ఆయనకి తేడా వచ్చింది. ఆ టైములో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు కొన్ని ఆహార నియమాలు పాటించాల‌ని సూచించడంతో అన్న‌య్య దాదాపు 10 కిలోల బ‌రువు తగ్గిపోయారు. ఆయన బయటకి రావడం లేదు కాబట్టి జుట్టుకు రంగు కూడా వేయట్లేదు.అందుకే ఆయన లుక్ లో అంత మార్పులు కనిపించాయి. ఆ ఫోటోని షేర్‌ చేసిన జయంత్‌ను కూడా నేను అడిగాను… ‘ఎందుకు ఆ ఫోటో షేర్ చేశావ‌ని’. ఆ ఫోటో చూసిన తర్వాత అంతా అన్న‌య్య‌ జుట్టుకు రంగు ఎందుకు వేసుకోలేదని అడుగుతున్నారు.

మ‌నిషికి 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడు అంటూ ఒకాయన కామెంట్ పెట్టాడు. నిజమే… వయసు పెరిగే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. నేను కూడా 15 కిలోలు త‌గ్గాను. కాబట్టి కంగారు పడకండి.. అన్నయ్య బాగున్నారు” అంటూ చెప్పుకొచ్చారు గోపాలకృష్ణ. అన్నయ్యకి నాకు ఒక విషయంలో అస్సలు పడదు. ఆయన క్లాస్ డైలాగులు బాగా రాస్తుంటడు, నేను మాస్ డైలాగులు రాస్తుంటాను. క్లాస్ విషయంలో ఆయన చెప్పిందే జరుగుతుంది. మాస్ సినిమాల విషయంలో నా అభిప్రాయమే నిజమవుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus