ఇటీవల విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం. కలెక్షన్ల విషయంలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఈ చిత్రం. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అసలు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్రలో ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మరియు ఎమోషన్స్ ఉన్నాయా.. అసలు ఇంత మంచి కథని ఇప్పటివరకూ ఎందుకు తెరకెక్కించలేదు. అసలు ఎందుకు ఏ హీరో ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు’.. అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి.
ఇదే ప్రశ్నకి పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. “2004లో ఈ చిత్రం చేయాలనే ఆలోచనకు భీజం పడింది. చిరంజీవిగారితోనే ఈ చిత్రం చేయాలని ప్రయత్నాలు సాగుతున్నప్పుడు… ఆయన 2008లో రాజకీయాలవైపు వెళ్ళిపోయారు. రాజకీయాలలో బిజీగా ఉన్న చిరంజీవిగారు … ‘నాతో కాకున్నా, చరణ్ తో ఈ మూవీ చేద్దాం’ అని చెప్పారు. ఒక వేళ చిరంజీవి రాజకీయాల్లోనే ఉండి ఉంటే… మళ్ళీ సినిమాలు వైపు రాకుండా ఉంటే.. ‘సైరా నరసింహారెడ్డి’ చరణ్ తోనే చేసే వాళ్ళం.” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.