పిన్న వయస్సులోనే నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి తొలి సినిమాతోనే నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి సినిమాలు హిట్ కావడం జూనియర్ ఎన్టీఆర్ కు స్టార్ హీరోగా గుర్తింపు రావడం జరిగింది. తాత పోలికలతో కనిపించే ఎన్టీఆర్ కు తాత మొండితనమే వచ్చిందని ఒక సందర్భంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. వీవీ వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆది సినిమాకు తాము డైలాగ్స్ రాశామని ఆర్జీవీ శివ మూవీలా వినాయక్
ఈ సినిమాను ఫ్యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిస్తానని చెప్పారని ఆ మాట నిలబెట్టుకుని మంచి హిట్ సినిమాను వినాయక్ తెరకెక్కించారని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. వైజాగ్ లో ఆది మూవీ క్లైమాక్స్ తీశామని షూటింగ్ సమయంలో తారక్ చెయ్యి అద్దానికి తగిలి దెబ్బ తగిలిందని తాను షూటింగ్ ఆగిపోయి ఉంటుందని భావిస్తే తారక్ మాత్రం అలానే గాయంతో నటించాడని అన్నారు. సర్దార్ పాపారాయుడు మూవీ క్లైమాక్స్ సమయంలో అన్నగారికి (సీనియర్ ఎన్టీఆర్ గారికి) కూడా చేతికి దెబ్బ తగిలిందని.. దెబ్బ తగిలినా ఆపకుండా షూటింగ్ లో పాల్గొన్నారని చెప్పారు.
సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ చేతికి ఆ విధంగా గాయమైనా షూటింగ్ ను ఆపకుండా షూటింగ్ ను పూర్తి చేశారని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆ తరువాత ఆది మూవీ చరిత్ర సృష్టించిందని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆ తరువాత ఆది సినిమా ప్రెస్ మీట్ లో తారక్ తనను తనను పెద్దనాన్న అని పిలవవచ్చా అని అడిగారని తాను తప్పకుండా పిలవమని అన్నానని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ పెదనాన్న అంటూ తనకు గౌరవం ఇస్తారని తెలిపారు.