రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. రావణాసుర సినిమాతో రవితేజ హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆ విషయాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. రవితేజ బాడీ లాంగ్వేజ్ కు ఈ సినిమా సరిపోలేదని ఆయన తెలిపారు.
బెంగాలీ మూవీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని నాకు తెలిసిన వాళ్లు చెప్పారని పరుచూరి అన్నారు. అది నిజమో కాదో తెలియదని ఈ సినిమా రీమేక్ అయితే మాత్రం మూలం పేరును టైటిల్ కార్డ్స్ లో వేసి ఉంటే బాగుండేదని ఆయన కామెంట్లు చేశారు. రైటర్ కు కథ క్రెడిట్స్ తప్పనిసరిగా ఇవ్వాలని పరుచూరి పేర్కొన్నారు. రచయితకు క్రెడిట్ ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు.
రావణాసుర తరహా సినిమాలు గతంలో ఎన్నో వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఆడలేదని క్లియర్ గా తెలిసిపోతుందని పరుచూరి అన్నారు. సినిమా ఫస్ట్ సీన్ లోనే ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. ఈ రోల్ రవితేజ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే పాత్ర కాదని సినిమాలో కట్స్ ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. రావణాసుర మూవీలో హత్యలను మూస ధోరణిలో చూపించారని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
ఎన్ని హత్యలు చేసినా తప్పించుకోవచ్చనే ప్రమాదకర మెసేజ్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. పరుచూరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజ రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. రవితేజకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?