Shaakuntalam: ‘శాకుంతలం’ అలా అవ్వడానికి కారణమిదే.. పరుచూరి ఏం చెప్పారంటే?

తెలుగు సినిమాలు విడుదలైన కొద్ది రోజులకు ఆ సినిమాలను పంచనామా చేసి.. ఎలా చేస్తే బాగుండేది అని చెబుతుంటారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఇప్పటివరకు చాలా సినిమాల విషయంలో తన విశ్లేషణను చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ.. తాజాగా ‘శాకుంతలం’ సినిమా గురించి వివరించారు. సమంత, దేవ్‌ మోహన్‌ జంటగా నటించిన ఈ సినిమాను గుణశేఖర్‌ తెరకెక్కించారు. ఈ సినిమా 14 ఏప్రిల్‌ 2023న విడుదలైన విషయం తెలిసిందే.

శకుంతల పాత్రలో సమంత అద్భుతంగా నటించారని విశ్లేషించిన పరుచూరి గోపాలకృష్ణ… గుణశేఖర్‌ కథను రాసిన విధానం, సినిమాను తెరకెక్కించిన విధానం బాగున్నాయని చెప్పారు. అయితే సెకండాఫ్‌ వల్లే ఈ సినిమా సరిగ్గా క్లిక్‌ అవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు. శకుంతల గర్భం దాల్చిన తర్వాత తన భర్త దుష్యంతుడిని కలవడం కోసం ఆయన రాజ్యానికి వెళ్తుంది. ఆమెను మర్చిపోయిన ఆయన ఇక్కడి నుండి వెళ్లిపో అని కేకలు వేస్తారు. గ్రామస్థులు ఆమెను రాళ్లతో కొట్టినట్లు సినిమాలో చూపించారు.

దీనిపై గోపాలకృష్ణ మాట్లాడుతూ నాకు తెలిసినంత వరకూ కాళిదాసు రచించిన కథలో శకుంతలను రాళ్లతో కొట్టినట్లు లేదు. స్త్రీ ప్రేక్షకులను కనెక్ట్‌ చేయడం కోసమే ఆ సీన్‌ పెట్టి ఉండొచ్చు అని అన్నారు. శకుంతల, దుష్యంతులు కలుస్తారా? లేదా? అనే ఆసక్తి ఫస్టాఫ్‌లో ప్రేక్షకుల్లో క్రియేట్‌ చేశారు. కానీ సెకండాఫ్‌లో ఉంగరాన్ని చూసిన వెంటనే రాజుకు గతం గుర్తుకురావడంతో వాళ్లిద్దరూ కలిసిపోతారని తెలిసిపోయేలా చూపించారు. ఇదే సినిమా సెకండాఫ్‌ ప్రభావం చూపించి ఉండొచ్చు అని అనుకుంటున్నాను అని చెప్పారు.

కథను రాయడంలో, (Shaakuntalam) సినిమాగా తెరకెక్కించడంలో గుణశేఖర్‌ తప్పు చేయలేదు అని కూడా అన్నారు. ఈ కథను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో గుణశేఖర్‌ సాహసం చేసి తెరకెక్కించారు. మంచి కథలను మర్చిపోతున్న రోజుల్లో సొంత డబ్బును రిస్క్‌ చేసి ఈ సినిమా చేసినందుకు గుణశేఖర్‌ గట్స్‌కు హ్యాట్సాఫ్‌ అని పరుచూరి మెచ్చుకున్నారు. అలా సినిమాను ఇప్పటి తరానికి, కొంతమంది కనెక్ట్‌ అయ్యేలా చేసే క్రమంలో ఇబ్బంది పడ్డారు అని ఆయన ప్రస్తావించారు అని చెప్పొచ్చు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus