టాలీవుడ్ ప్రముఖ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదలైన వెంటనే ఆ సినిమాల గురించి అభిప్రాయాలను పంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా గుంటూరు కారం సినిమాకు సంబంధించి రివ్యూను పంచుకోగా ఆ రివ్యూలో చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూలో గుంటూరు కారం సినిమాలోని తప్పులను ఎక్కువగా హైలెట్ చేశారు.
గుంటూరు కారం మహేష్ రేంజ్ సినిమా కాదని మహేష్ పై నాకు అభిమానం ఉంది కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడాలని ఆయన అన్నారు. గుంటూరు కారం స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్ గా అనిపించిందని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడని పరుచూరి వెల్లడించారు. చిరంజీవి వాణిశ్రీ కాంబో రేంజ్ లో మహేశ్ రమ్యకృష్ణ కాంబో ఉంటుందని ఊహించానని ఆయన అన్నారు. ఈ కథలో అమ్మను హీరో దైవంలా కొలుస్తాడు తప్ప టీజ్ చేయడని పరుచూరి చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో సెంటిమెంట్ పండలేదని ఆయన కామెంట్లు చేశారు. సెంటిమెంట్ ప్రధానంగా తీయాలని అనుకుంటే ఈ సినిమాకు ఫిక్స్ చేసిన టైటిలే తప్పు అని పరుచూరి వెల్లడించారు. గుంటూరు కారం సినిమాకు డబ్బులు రావడం వేరని సంతృప్తి రావడం వేరని ఆయన అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాకు ఎంతో అభిమానం అని త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ మంచి కథతో వస్తారని ఆశిస్తున్నానని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది. భాషతో సంబంధం లేకుండా గుంటూరు కారం మూవీ ఓటీటీలో సత్తా చాటుతోంది. మరోవైపు మహేష్ జక్కన్న మూవీకి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. మహేష్ తర్వాత మూవీ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!
‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!