Dhamaka Movie: రవితేజ ధమాకా సినిమాపై పరుచూరి షాకింగ్ కామెంట్స్!

రవితేజ శ్రీ లీల జంటగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో గత ఏడాది డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ధమాకా. ఈ సినిమా కథ ఏడాది చివరిలో విడుదలైనప్పటికీ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని ఏకంగా 110 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం విశేషం. తాజాగా ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఈ సినిమా కథాంశం ఏంటి అనే విషయానికి వస్తే తండ్రి కాని తండ్రి ఆస్తి లాక్కోవాలని చూసే ఓ విలన్ పని పట్టిన హీరో కథ ఇందులో నటి శ్రీ లీల నటుడు రావు రమేష్ పాత్రలో చూస్తే పర్ఫెక్ట్ క్యారక్టరైజేషన్ అనేది అవసరం లేదని చెప్పడానికి సరైన ఉదాహరణలుగా అనిపించాయని తెలిపారు. ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించిన విధానం చూస్తే దర్శకుడు రచయిత ప్రేక్షకులను ఆడుకున్నారని తెలుస్తోంది.

ఒక క్షణం అలా కంటి చూపును పక్కకు తిప్పితే ఎక్కడ కథ మిస్ అవుతామో అనే విధంగా స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసారని పరుచూరి వెల్లడించారు. దర్శకుడు ప్రతిభకు రవితేజ నటన తోడు కావడంతో సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని అందుకు రవితేజకు హాట్సాఫ్ చెప్పాలని పరుచూరి వెల్లడించారు. ఇక ఈ సినిమాని మనం ఇంట్లో కూర్చుని చూస్తే పెద్దగా అనిపించదు కానీ థియేటర్లో కూర్చొని చూస్తే ఈ సినిమా మరింత ఎక్కువ సంపాదించి ఉండాల్సింది కదా అనిపిస్తుందని తెలిపారు.

ఇక ఈ సినిమాలో ఒక సన్నివేశం గురించి పరుచూరి మాట్లాడుతూ..రావు రమేష్ రవితేజను చూసి దండం పెడుతున్న సన్నివేశం కనుక చూస్తే మేము రాసిన సమరసింహారెడ్డి ఇంద్ర సినిమాలు గుర్తుకు వస్తాయని ఈ సన్నివేశం చీటింగ్ సీన్ లా(నవ్వుతూ) అనిపించిందని తెలిపారు.ఇక రావు రమేష్ పాత్ర కాస్త అయోమయంగా ఉన్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం మనసుని హత్తుకునే విధంగా ఉంది అంటూ ఈ సందర్భంగా పరుచూరి ధమాకా సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు .

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus