జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లను సాధించిన ఈ సినిమా వీక్ డేస్ లో ఆశించిన రేంజ్ లో కలెక్షన్లను సాధించడంలో ఫెయిలైంది. అయితే పరిమిత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
బ్రో మూవీ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ మూవీ అని గతంలో కూడా మనం ఇలాంటి సినిమాలు చూశామని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. దాదాపుగా 30 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యముడి కథతో ఎన్నో సినిమాలు తెరకెక్కాయని ఆయన కామెంట్లు చేశారు. అలా తెరకెక్కిన సినిమాలలో యమగోల, యమలీల, యమజాతకుడు, యముడికి మొగుడు చూశామని పరుచూరి చెప్పుకొచ్చారు.
నరకానికి అధిపతి యముడు అని చనిపోయిన మనిషిని తీసుకెళ్లడానికి యముడు వస్తాడని అయితే ఆ జాడలు ఎక్కడా కనిపించకుండా సముద్రఖని బ్రో మూవీ తెరకెక్కించాడని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. ఈ సినిమాలో క్లైమాక్స్ మరో విధంగా ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు. కాలం 90 రోజుల గడువు కాకుండా 90 ఏళ్ల గడువు ఇచ్చి ఉంటే బాగుండేదని పరుచూరి పేర్కొన్నారు.
90 సంవత్సరాల వయస్సులో మార్క్ చనిపోయి కాలాన్ని కలిసి ఉంటే బాగుండేదని పరుచూరి అన్నారు. అలా చేసి ఉంటే సినిమా మరింత బెటర్ గా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. యమదొంగ, యమగోల సినిమాలను ఫాలో అయ్యి ఉంటే ఈ సినిమా మరోలా ఉండేదని నా అభిప్రాయం అని పరుచూరి కామెంట్లు చేశారు. పరుచూరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!