జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల మద్దతు ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ పవన్ సినీ, రాజకీయ జీవితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ దెబ్బ తిన్న పులిలా వస్తున్నాడని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజం మారాలంటే అధికారం అప్పుడప్పుడూ మారుతూ ఉండాలని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఒకరి చేతుల్లోనే అధికారం ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్లే పవన్ గత ఎన్నికల్లో పోటీ చేశారని పరుచూరి వెల్లడించారు.
ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో నిరాశ చెందకుండా పవన్ దెబ్బ తిన్న పులిలా వస్తున్నాడని పరుచూరి పేర్కొన్నారు. ఓటింగ్ అనేది పెద్ద రాజకీయ తంత్రం అని రాజకీయాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయని వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని పరుచూరి పేర్కొన్నారు. సమాజం గురించి పొలిటీషియన్స్ చెబితే వినేవారితో పోల్చి చూస్తే సినిమా వాళ్లు చెబితే ఎక్కువగా వినేవారు ఉన్నారని పరుచూరి వెల్లడించారు.
పవన్ (Pawan Kalyan) బాగుండాలని కోరుకునే వాళ్లలో నేనూ ఒకడినని పరుచూరి అన్నారు. పవన్ సినిమాలు చేయడం ఆపేయవద్దని సినిమాల్లో కెరీర్ ను కొనసాగించాలని ఆయన అన్నారు. టైమ్ లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ లా అప్పుడప్పుడైనా పవన్ సినిమాల్లో నటించాలని పరుచూరి వెల్లడించారు. బ్రో మూవీ గురించి తెలిసిన వెంటనే ఆశ్చర్యపోయానని పవన్, సాయితేజ్ కలిసి నటించడం ఏమిటని అనుకున్నానని పరుచూరి పేర్కొన్నారు.
సాయితేజ్ ప్రమోషన్ కోసం పవన్ ఈ సినిమా చేశారని అనిపించిందని పరుచూరి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ బంగారు బిడ్డ అని పవన్ సినిమాల్లోనే కొనసాగితే మరో పదిహేను సంవత్సరాలకు చిరంజీవ్లిలా ఎదిగేవారని పరుచూరి కామెంట్లు చేశారు. పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికల ఫలితాలు జనసేనకు అనుకూలంగా ఉండాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!