పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో హీరో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలో నటించే చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంతోమంది ఎన్నో అవార్డులను అందుకోవడమే కాకుండా తిరిగి హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పసివాడి ప్రాణం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ ఎంతో సుపరిచితమే. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1987వ సంవత్సరంలో విడుదలైంది చిరంజీవి కెరీర్ మొదట్లో నటించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకుందని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో నటిగా సుమలత కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో కుర్రాడి పాత్రలో సందడి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.అయితే ఇప్పుడు ఆ కుర్రాడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే… నిజానికి పసివాడి ప్రాణం సినిమాలో బుడ్డోడి పాత్రలో నటించినది అబ్బాయి కాదు అమ్మాయి. ఇలా అమ్మాయి ఆ పాత్రలో నటించారనే విషయం చాలామందికి తెలియదు.

అయితే ఇలా పసివాడి ప్రాణం సినిమాలో నటించిన ఈ అమ్మాయి మరేవరో కాదు ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో సందడి చేస్తున్న సీరియల్ యాక్టర్స్ సుజిత. గత కొద్ది రోజుల క్రితం స్టార్ మా లో ప్రసారమైన వదినమ్మ సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా సుజిత చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం ఈమె పలుకు బుల్లితెర సీరియల్స్ లో అలాగే వెండి తెరపై పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్నారు.

1983 జూలై 12వ తేదీ తిరువనంతపురంలో జన్మించిన సుజిత బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఇక ఈమె ధనుష్ అనే నిర్మాతను వివాహం చేసుకొని చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఇలా తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా మలయాళంలో కూడా ఈమె సినిమాలు సీరియల్స్ ,వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus