Pathaan: ‘పఠాన్’ (తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కలుపుకుని పాన్ ఇండియా మూవీ వరల్డ్ లోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఇండియన్ సినిమాగా రికార్డులు సృష్టించింది ‘పఠాన్’ మూవీ. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తుంది.

జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నాడు. దీంతో జనవరి 25న రిలీజ్ కాబోతున్న ‘పఠాన్’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 1.20 cr
సీడెడ్ 0.82 cr
ఉత్తరాంధ్ర 0.85 cr
ఈస్ట్ 0.20 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.30 cr
కృష్ణా 0.25 cr
నెల్లూరు 0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.96 cr

‘పఠాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.96 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అది కూడా నైజాంలో చాలా బాగున్నాయి. టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus