Pathaan: డబ్బింగ్ సినిమాకి భారీ రేటు!

  • January 24, 2023 / 07:54 PM IST

సంక్రాంతి సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సందడి చేశాయో తెలిసిందే. ముఖ్యంగా బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలు అంచనాలకు మించి కలెక్షన్స్ సాధించాయి. డబ్బింగ్ సినిమా ‘వారసుడు’ కూడా ఓ మోస్తరు వసూళ్లను సాధించింది. చిరంజీవి, బాలయ్య సినిమాలకు ఉన్న డిమాండ్, పైగా సంక్రాంతి సీజన్ కాబట్టి ఆ సినిమాలకు టికెట్ రేట్లు పెంచి క్యాష్ చేసుకున్నారు. ఈ విషయంలో జనాలు కూడా పెద్దగా ఫీల్ అయినట్లు కనిపించలేదు.

మొదటి వారం ఎక్కువ రేటు పెట్టే థియేటర్ లో సినిమా చూశారు. కానీ ప్రభుత్వం ఈ రేట్ల పెంపుని కేవలం వారం నుంచి పది రోజుల వరకే పర్మిషన్ ఇచ్చింది. కానీ రెండో వారంలో కూడా ఎగ్జిబిటర్లు అవే రేట్లను కొనసాగిస్తున్నారు. సెకండ్ వీక్ కూడా అయిపొయింది. సోమవారం నుంచి థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు అయినా రేట్లు తగ్గిస్తే బాగుండేది. కానీ అలా చేయలేదు. నిన్నటివరకు అయితే ఇవే రేట్లను కంటిన్యూ చేశారు.

ఇదివరకు ఇలా టికెట్ రేట్లు భారీగా పెంచేయడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. దీంతో ఆక్యుపెన్సీలు బాగా పడిపోయాయి. పరిస్థితి గమనించి రీజనబుల్ రేట్లకు టికెట్లను అమ్మడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఇంతలోనే మళ్లీ పాత కథను రిపీట్ చేసేలా కనిపిస్తున్నారు. సంక్రాంతి సినిమాలకు రెండో వారం తరువాత కూడా ఎక్కువ రేట్లు కొనసాగించడం దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఈ సినిమాలను చూసి ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన డబ్బింగ్ సినిమా ‘పఠాన్’కి కూడా రేట్లు పెంచి టికెట్లు అమ్ముతున్నారు. హైదరాబాద్ లాంటి సిటీలో ‘పఠాన్’ సినిమా తెలుగు వెర్షన్ కి సింగిల్ స్క్రీన్ లో రూ.175, మల్టీప్లెక్స్ లో రూ.295కి టికెట్లు అమ్ముతున్నారు. ఒక డబ్బింగ్ సినిమాకి ఇంత రేటు పెట్టి వెళ్లాలంటే ప్రేక్షకులు ముందుకొస్తారా..? హిందీ వెర్షన్ కి ఉండే డిమాండ్ వేరే కాబట్టి ఆ ధర ఓకే అనుకుందాం. కానీ తెలుగు వెర్షన్ తో ఎక్కువ మందిని థియేటర్లకు రప్పించాలంటే మాత్రం టికెట్ రేట్లు తగ్గించాల్సిందే.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus