‘పఠాన్’ సినిమా ఫస్ట్ వచ్చింది ఆలస్యం.. ‘బాయ్‌కాట్ బ్యాచ్’, ‘మనోభావాలు బ్యాచ్’ రెడీ అయిపోయారు. ఈ సినిమా పోస్టర్‌ఓ అది బాలేదు, పాటలో ఇది బాలేదు, ఆ రంగు తీసేయ్, ఈ మాట తీసేయ్, మొత్తం సినిమానే ఆపేయ్ అంటూ ఏవేవో కామెంట్లు చేస్తూ వచ్చారు. దీంతో టీమ్ చాలా ఇబ్బంది పడింది అనే చెప్పాలి. మరో రెండు వారాల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ప్యాచ్ వర్క్ చేస్తోందిప్పుడు. ఇలాంటి సమయంలో సినిమాకు హ్యాపీ న్యూస్ వచ్చింది అని చెప్పాలి. అవును.. దేశంలో ఎక్కువమంది వెయిట్ చేస్తున్న సినిమాగా నిలిచింది.
సినిమాల రేటింగ్స్ విషయంలో సీనీ గోయర్స్ ఎక్కువగా చూసే IMDB తాజాగా ఓ లిస్ట్ విడుదల చేసింది. ఈ ఏడాది అత్యధికంగా ఇండియన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టాప్ 20 సినిమాల పేర్లను ఆ లిస్ట్‌లో పొందుపరిచింది. అందులో అనూహ్యంగా ‘పఠాన్’ సినిమా తొలి స్థానంలో నిలిచింది. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల హవా కొనసాగుతుంది, ఆ సినిమాలే టాప్ అని అనుకుంటున్న సమయంఓ ఫస్ట్ ప్లేస్‌లో ‘పఠాన్’ నిలవడం పెద్ద విషయమే అని చెప్పాలి.
షారుఖ్ ఖాన్ నుండి మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘పఠాన్’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. యాక్షన్ సీన్స్, దీపిక పడుకొణె స్క్రీన్ ప్రజెన్స్ లాంటివి సినిమాకు అదనపు ప్లస్‌లు. అయితే ఈ సినిమా విషయంలో వస్తున్న విమర్శల నేపథ్యంలో జనాలు వెయిట్ చేస్తున్నారా లేదా అనే డౌట్ ఉండేది. అయితే ఇప్పుడు IMDB లెక్కలతో విషయం తెలిసిపోయింది. ఇక ఆ లిస్ట్‌లో రెండో ప్లేస్ లో ‘పుష్ప ది రూల్’ నిలిచింది. ఆ తర్వాత మళ్లీ షారుఖ్ ఖాన్ సినిమానే నిలిచింది.
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తున్న ‘జవాన్’ మూడో ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాతి రెండు స్థానాలు ప్రభాస్ సినిమాలు ఆక్యుపై చేసుకున్నాయి. ‘ఆది పురుష్’, ‘సలార్’ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆ వెంటనే విజయ్ ‘వరిసు’ / ‘వారసుడు’ ఉంది. ఆ నెక్స్ట్ కన్నడ సినిమా ‘కబ్జా’ నిలిచింది. ఆ నెక్స్ట్ విజయ్ – లోకేశ్ కనగరాజ్ సినిమా ఉండగా, ఆ వెంటనే ‘ది ఆర్చీస్’, ‘డుంకీ’ ఉన్నాయి. వాటి తర్వాత ‘టైగర్ 3’, ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’, ‘తునివు’, ‘యానిమల్’, ‘ఏజెంట్’, ‘ఇండియన్ 2’, ‘వడివాసల్’, ‘షెహజాదా’, ‘బడే మియా చోటే మియా 2’, ‘భోళా’ ఉన్నాయి.