తెలుగులో దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో నటించడం ద్వారా పావలా శ్యామల నటిగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఖడ్గం, గోలీమార్ సినిమాల్లోని పాత్రలు పావలా శ్యామల ఎంత గొప్ప నటో ప్రూవ్ చేశాయి. తన సినీ కెరీర్ లో పేదింటి మహిళ పాత్రల్లో ఎక్కువగా నటించిన పావలా శ్యామల నిజ జీవితంలో కూడా పేద మహిళ అనే సంగతి తెలిసిందే. తన కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో ఈ మధ్య కాలంలో తన కష్టాలను చెప్పుకుంటూ పావలా శ్యామల వార్తల్లో నిలిచారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కూతురు మాధవి ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావిస్తూ పావలా శ్యామల ఎమోషనల్ అయ్యారు. రెండు సంవత్సరాల క్రితం తన కూతురు టీబీ బారిన పడితే చిరంజీవి వాళ్ల అమ్మాయితో రెండు లక్షలు పంపించి చికిత్స కోసం సహాయం చేశారని పావలా శ్యామల అన్నారు. ఆ తరువాత ఒకరోజు కూతురు కింద పడిపోయిందని ఆ సమయంలో కాలి ఎముకలు విరగడంతో రాడ్లు వేయించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
కూతురికి కాలి ఎముకలు విరిగిన సమయంలో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశానని కూతురుకు ఫిజియో థెరపీ కోసం లక్ష రూపాయలు ఖర్చు చేశానని పావలా శ్యామల అన్నారు. బలమైన ఆహారం పెట్టలేక కూతురును చంపాలని అనుకున్నానని తల్లిని కాబట్టి ఆ పని చేయలేకపోయానని ఆమె చెప్పారు. తన బాధ ఎవరినైనా కదిలిస్తే జాలి పడి సహాయపడమని ఆమె కోరారు. తనను అవమానించవద్దని తాను, తన కుటుంబం అనుభవించాల్సిన అవమానాలు, నరకాలు చాలా ఉన్నాయని పావలా శ్యామల తెలిపారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!