రేణుకా స్వామి హత్య, దర్శన్ అరెస్టు.. ఆ ముందు, తర్వాత జరిగిన పరిణామాల గురించి ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన నటి పవిత్ర గౌడ స్పందించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని దర్శన్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదని చెప్పింది. హత్య కేసులో ప్రథమ నిందితురాలు పవిత్ర గౌడ అనే విషయం మీకు తెలిసిందే. అశ్లీల వీడియోల విషయంలో తాను తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని పవిత్ర గౌడ పోలీసుల ముందు వాపోయింది.
రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి విచారణలో బుధవారం వరకు ధీమాగా ఉన్న పవిత్ర.. గురువారం మాత్రం ఆందోళనకు గురైంది. ఈ క్రమంలోనే దర్శన్‌కు ఆ విషయం చెప్పడం సరికాదు అని అభిప్రాయపడింది. మొదట అతని రేణుకా స్వామి ముఖంపై దర్శన్ పిడిగుద్దులు కురిపించాడట. కింద పడుతున్న స్వామి తల పక్కనే ఉన్న టెంపోకు తగిలిందట. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న స్వామి మర్మావయాలపై దర్శన్ తన్నడంతోనే మరణించాడు అని ప్రాథమిక విచారణలో తేలింది.
ఇదిలా ఉండగా తన తండ్రి దర్శన్, తల్లి విజయలక్ష్మికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత అవసరం అని వారి కుమారుడు వినీశ్ తూగుదీప సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌పెట్టాడు. రేణుకా స్వామిని తన తండ్రి హత్య చేసి ఉంటాడని తాను అనుకోవడం లేదని, దర్యాప్తు తర్వాతే అసలు విషయం తెలుస్తుందని వినీశ్ రాసుకొచ్చాడు. ఇక దర్శన్ సినిమాల సంగతి చూస్తే..
‘కాటేర’ సినిమా విజయవంతమైన తర్వాత ‘డెవిల్’ సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా 25 రోజుల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చిత్రీకరణలో ఎడమ చేతికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నాడు. దీంతో చిత్రీకరణ వాయిదా పడింది. బుధవారం నుండి దర్శన్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. హత్య కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.