Pavitra Lokesh: దయచేసి నాకు నరేష్ కు సపోర్ట్ చేయండి: పవిత్ర

  • July 2, 2022 / 11:56 AM IST

పవిత్ర లోకేష్- నరేష్ ల గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త పై ఈ ఇద్దరూ ప్రత్యక్షంగా క్లారిటీ ఇవ్వక ముందే చాలా రాద్ధాంతం జరిగింది. ఒక వైపు నరేష్ మూడో భార్య.. మరో వైపు పవిత్ర లోకేష్ మాజీ భర్త వీళ్ళపై చేస్తున్న కామెంట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇంకో పక్క నరేష్, కృష్ణ ఫ్యామిలీ నాకు అండగా ఉంది అని, నేను నరేష్ తో చాలా కాలంగా కలిసుంటున్నాం అని, ‘కృష్ణ, నరేష్, నేను… ఒకే ఇంట్లో ఉంటున్నాం అని పవిత్ర స్ట్రింగ్ ఆపరేషన్ లో అసలు మేటర్ ను బయటపెట్టింది.

ప్రస్తుతం వీళ్ళ టాపిక్ కు సంబంధించిన వార్త వచ్చినా ఇండియా వైడ్ ట్రెండ్ అవుతూ ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. గత రెండు మూడు రోజులుగా నరేష్ మూడో భార్య రమ్య చేస్తున్న రచ్చకి తాజాగా పవిత్ర మీడియా ముందుకు వచ్చి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. పవిత్ర మాట్లాడుతూ.. “నేను తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు.. చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చాను కానీ.. తెలుగు వాళ్ళు నన్ను బాగా ఆదరిస్తున్నారు.

ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్ మీతో చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను.నరేష్ గారు ఎవరు? ఆయనతో నాకు ఉన్నది ఏంటో మీకు అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పని అంతకంటే లేదు. కానీ నరేష్ గారి వైఫ్ అంటూ రమ్య ఆమె మీడియా ముందుకు వచ్చి.. నా పైన ఏవేవో ఆరోపణలు చేస్తుంది.నేను వాళ్ల మధ్యకి వచ్చి..

రిలేషన్ షిప్‌లో ఉన్నానని.. పెళ్లి చేసుకున్నానని కర్ణాటక మీడియా ముందు నన్ను నేరస్థురాలిగా నిలబెట్టింది. ఇది నన్ను చాలా బాధపెట్టింది.ఈ విషయం పై మాట్లాడటానికి నరేష్ గారు కర్ణాటక వెళ్లారు.. నేను కూడా ఈ విషయం పై స్పందించడం జరిగింది. ఆమెకు భర్త కావాలనిపిస్తే.. ఫ్యామిలీ లో ఉండే అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలి. నరేష్ గారు తెలుగులో ఫేమస్ యాక్టర్. కానీ..

ఆమె కర్ణాటక వచ్చి మీడియాతో మాట్లాడుతుందంటే ఎందుకు? తనకు ప్రాబ్లమ్ ఉంటే.. హైదరాబాద్‌లో చెప్తే పెద్దవాళ్లు వచ్చి న్యాయం చెప్తారు. కానీ అక్కడికి వెళ్లి అలా చేయడం, చెప్పడం నాకు తప్పు అనిపిస్తుంది. దయచేసి ఈ విషయంలో మీరంతా నాకు, నరేష్‌ గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus