Pawan Kalyan: ‘తమ్ముడు’ ఫైట్స్‌ డూప్‌ చేశాడా.. పవన్‌ సమాధానం ఏంటంటే?

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో స్టంట్స్‌ నిజమా? డూపా? మీకెప్పుడైనా ఈ డౌట్‌ వచ్చిందా? పవన్‌ సినిమాలను క్లోజ్‌గా ఫాలో అయ్యేవాళ్లకు ఈ డౌట్‌ ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన తొలి సినిమా నుండి మొన్నీమధ్య వచ్చిన సినిమాల వరకు పవన్‌ ఎప్పుడూ డూప్‌లను ఫైట్స్‌లో వాడలేదు. అయితే ఈ ‘డూప్‌’ డౌట్‌ను పవన్‌ కల్యాణ్‌ దగ్గర బాలకృష్ణ ప్రస్తావించారు. ఈ క్రమంలో ‘తమ్ముడు’ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

‘ఏంటి బ్రదర్‌.. ‘తమ్ముడు’ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ కోసం డూప్‌ను వాడారట’ కదా.. అని బాలయ్య అడిగితే.. కాదు అంటూ పవన్‌ ఓ విషయం చెప్పిన విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘‘తమ్మడు’ సినిమా షూటింగ్‌లో ఓ స్తంభాన్ని కొట్టాలి. యాక్షన్‌ అనగానే స్తంభాన్ని కొడుతూనే ఉన్నా. తీరా చూస్తే రక్తం వస్తోంది. అయినా షాట్ పూర్తి చేసేశా! అయితే ఆ తర్వాత ఆ ఆర్ట్‌ డైరక్టర్‌ ఎవరో రమ్మనండి అని అన్నాను’’ అంటూ నవ్వేశారు పవన్‌.

అయితే అక్కడ ఇంకా ఏం జరిగింది అనే విషయం పూర్తి ఎపిసోడ్‌లో తెలిసే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ‘అన్‌స్టాపబుల్‌’ ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమోల ప్రకారం చూస్తే.. మూడు పెళ్లిళ్ల వ్యవహారం, త్రివిక్రమ్‌తో స్నేహం, సాయిధరమ్‌ తేజ్‌ మీద ఉన్న అభిమానం, ఫిటింగ్‌ మాస్టర్‌ అని రామ్‌ చరణ్‌ను బాలకృష్ణ ఎందుకు పిలిచారు లాంటి విషయాలకు రెండు ఎపిసోడ్లలో సమాధానం దొరికే అవకాశం ఉంది.

ఇందులో భాగంగా తొలి ఎపిసోడ్‌ను తొలుత ఫిబ్రవరి 3న విడుదల చేస్తాం అన్నారు. అయితే ఏమైందో ఏమో ఒక రోజుకు ముందుకు జరిపి రెండో తేదీ అంటే ఈ రోజు రాత్రి 9 గంటలకు రిలీజ్‌ చేస్తున్నారు. అయితే తొలి ఎపిసోడ్‌లో ఏయే విషయాలు ఉంటాయి అనేది చూడాలి. ఎందుకంటే ప్రభాస్‌ తొలి ఎపిసోడ్‌లో పెద్దగా స్టఫ్‌ ఏమీ లేదు అనే విమర్శలు వచ్చాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus