టాలీవుడ్ స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) , అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చాలా సందర్భాల్లో క్లారిటీ వచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారంలో భాగంగా పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ తో ఆశ్చర్యపరిచారు. ఓటర్లు ఇంట్లో కూర్చుని తగ్గేదేలే అని డైలాగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదని ఎన్నికల సమయంలో ఓటేసి బలాన్ని చూపించాలని అన్నారు.
ఏపీ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోవైపు పుష్ప ది రూల్ (Pushpa2) మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ చివర్లో బన్నీ గాజు గ్లాస్ పట్టుకుని స్టెప్పులు వేయడంతో జనసేనకు మద్దతుగా బన్నీ ఈ విధంగా చేశారని పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
జనసేనకు పరోక్షంగా అల్లు అర్జున్ కూడా సపోర్ట్ ఇస్తున్నారని అభిమానులు పేర్కొన్నారు. 15 సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బన్నీ ఇప్పుడు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పుష్ప ది రూల్ సాంగ్ లో గాజు గ్లాస్ తో బన్నీ డ్యాన్స్ చేయడం యాదృచ్ఛికంగా జరిగిందో లేక బన్నీ కావాలని ప్రచారం చేశారో తెలియాల్సి ఉంది.
మరోవైపు పుష్ప ది రూల్ రిలీజ్ కు మూడు నెలల సమయం మాత్రమే ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. పుష్ప ది రూల్ ష్యూర్ షాట్ హిట్ మూవీ అని తాము కోరుకున్న విజయం ఈ సినిమాతో దక్కుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. సుకుమార్ (Sukumar), బన్నీ ఈ సినిమాతో ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ మూవీ విజువల్స్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది.