పవన్ కళ్యాణ్ కి కొడుకు పుట్టాడోచ్!

మొదటిసారి వారసుడ్ని చూసుకుని మురిసిపోతున్న పవన్ కళ్యాణ్ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. ఆ వారసుడెవరో కాదు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లేజ్నోవాకు పుట్టిన కుమారుడు. నేడు (అక్టోబర్ 10) హైద్రాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో అన్నా లేజ్నోవా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆల్రెడీ ముగ్గురు వారసులు (అకీరా, ఆద్య, పోలేనా)లతో సంతోషంగా ఉన్న పవన్ కళ్యాణ్ కుటుంబంలోకి సరికొత్త వారసుడి ఆగమనంతో ఆయన కుటుంబంలోనే కాక యావత్ పవన్ కళ్యాణ్ అభిమానుల లోగిళ్లలోనూ ఆనందం వెల్లివిరిసింది.

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “అజ్ణాతవాసి” షూటింగ్ చివరి దశకు చేరుకోవడం, “జనసేన” పార్టీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం, పవన్ కళ్యాణ్ కి కుమారుడు పుట్టడం వంటివన్నీ ఒకదానివెనుక మరొకటి జరగడంతో పవన్ కళ్యాణ్ అభిమాన శ్రేణులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇకపోతే.. తన కుమారుడికి భారత సంస్కృతి ప్రకారం ఇండియన్ నేమ్ ఏదైనా పెడతాడా లేక తన భార్య అనా లేజ్నోవా దేశ సంస్కృతిని గౌరవించి కుమార్తెకు “పోలెనా” అనే పేరు పెట్టినట్లుగా.. కుమారుడికి అదే తరహా పేరు పెడతాడా అనేది వేచి చూడాల్సిందే. ఎనీవే.. పుత్రోత్సాహంతో ఫుల్లు జోష్ మీదున్న పవన్ కళ్యాణ్ కి “ఫిల్మీఫోకస్” శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus