సీనియర్ నటుడు ప్రకాష్ ఉన్నట్లుండి పవన్ ఫ్యాన్స్ కి శత్రువుగా మారిపోయారు. పవన్ రాజకీయ విధానాలపై ప్రకాష్ రాజ్ ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆయన చేసిన కామెంట్స్ జనసైనికులను బాధపెట్టాయి. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి పవన్ ని ఇంతపెద్ద మాట అనాల్సిన అవసరం లేదంటూ మండిపడుతున్నారు. మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంలో ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేసి తనదైన శైలిలో బదులిచ్చారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ విమర్శలపై పవన్ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
పవన్ గనుక మీడియా ముందుకు వస్తే కచ్చితంగా ఈ ప్రశ్న ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అయితే అంతకంటే ముందు ప్రకాష్ రాజ్.. పవన్ కి ఎదురుపడితే ఇద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందనేది ఆసక్తికరం. నిజానికి ఇప్పుడు ఇద్దరి మధ్య అలాంటి సందర్భం ఎదురయ్యేలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలో ప్రకాష్రాజ్ కూడా నటిస్తున్నారు. ఇందులో పవన్బాధితురాళ్లయిన అమ్మాయిల తరఫున వాదించే లాయర్ పాత్రలో నటిస్తుండగా.. బడా బాబుల వైపు వాదించే ప్రత్యర్థి లాయర్‌గా ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు. ఈ నెల ఆరంభం నుండే పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ప్రకాష్ రాజ్ కి కూడా ఈ సన్నివేశాల్లో భాగస్వామ్యం ఉంది. పవన్ కి ప్రకాష్ రాజ్ కి కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. కాబట్టి ఒకరికొకరు ఎదురుపడడం ఖాయం. మరి ఆ సమయంలో ఎలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుందో చూడాలి. మరి ఇద్దరి మధ్య విమర్శల ప్రస్తావన వస్తుందా.? అనేది కీలకం. ఇదే విషయాన్ని ప్రకాష్ రాజ్ దగ్గర ప్రస్తావిస్తే.,. వ్యక్తిగతంగా, సినిమాల పరంగా తనకు పవన్ తో ఎలాంటి విభేదాలు లేవని.. ప్రొఫెషనల్ గా తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పాడు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?