పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం!

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలను, ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సాగర్.కె.చంద్ర. కాగా నేటినుంచి ఈ యాక్షన్ సన్నివేశాలలో రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలసి పాలు పంచుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్న విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లు పాల్గొనగా పదిరోజులపాటు హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు నిర్మాత. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

ప్రముఖ నటులుసముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ‘ప్రసాద్ మూరెళ్ళ’ ఛాయాగ్రాహకునిగా,ఎడిటర్ గా ‘నవీన్ నూలి’, కళా దర్శకునిగా ‘ఏ.ఎస్.ప్రకాష్ లు ఇప్పటివరకు ఎంపిక అయ్యారు అని తెలిపారు. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీ,నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి సమర్పకులు గా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus