Pawan Kalyan: అడివి శేష్ ని పొగిడేసిన పవన్ కళ్యాణ్!

రీసెంట్ గా అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగులోనే కాకుండా.. మిగతా భాషల్లో కూడా సినిమాకి హిట్ టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను ప్రశంసిస్తూ.. పవన్ కళ్యాణ్ ఓ పోస్ట్ పెట్టారు. ”ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొంది.

నాడు చేసిన కమెండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై ‘మేజర్’గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించాను. అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి.

పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో మేజర్ ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకొన్నాను. త్వరలోనే ఆ చిత్రం వీక్షిస్తాను. ఈ చిత్ర కథానాయకుడు సోదరుడు అడివి శేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రఖ్యాత రచయిత దివంగత శ్రీశ్రీ అడివి బాపిరాజు గారి మనవడైన శ్రీ శేష్ సినిమాలో భిన్న శాఖలపై అభినవేశం ఉన్న సృజనశీలి. తెలుగు సాహిత్యంపై మక్కువ… వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటల్లో తెలుస్తుంది.

ఇటువంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలి. ఒక సాహసి కథను చలన చిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శ్రీ శశికిరణ్ కు శుభాకాంక్షలు. ఇటువంటి మంచి చిత్రాలు ఆయన నుంచి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను. ‘మేజర్’ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ హీరో శ్రీ మహేశ్ బాబు గారికి, చిత్ర నిర్మాతలు శ్రీ శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలకు నా అభినందనలు.

ఈ చిత్రంలో నటించిన శ్రీ ప్రకాష్ రాజ్, శ్రీమతి రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మలకు, చిత్ర సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు” అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అడివి శేష్.. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు చెప్పారు. మీరు టూర్ లో ఉండేసరికి మేజర్ సినిమాను చూసే సమయం ఉంటుందా అనుకున్నానని.. కానీ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఆరోజు ‘పంజా’, ఈరోజు ‘మేజర్’.. మీ దయకు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని బదులిచ్చారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus