Pawan Kalyan: త్రివిక్రమ్ భార్య స్పెషల్ డ్యాన్స్.. గెస్ట్ గా పవర్ స్టార్!

త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ అని చాలా మందికి తెలియదు. ఇక చాలా కాలం తరువాత ఆమె ‘మీనాక్షి కళ్యాణం’ అనే శాస్త్రీయ నృత్య నాటకం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రదర్శనకు పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి శిల్పకళా వేదికలో జరగనుంది.హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ ఈవెంట్‌ను నిర్మిస్తున్నాయి.

సౌజన్య శ్రీనివాస్ అధికారిక పోస్టర్‌ను ఈరోజు ఉదయం విడుదల చేశారు.ఆమె క్లాసికల్ డ్యాన్సర్ అవతార్‌లో ట్రెడిషినల్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఫీనిక్స్ ఫరెవర్ మరియు సాయి సూర్య డెవలపర్స్ స్పాన్సర్ చేస్తుండగా అనిందిత మీడియా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.ఈ వేడుక కోసం హైదరాబాద్‌లోని త్రివిక్రమ్ అభిమానులు, కళాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

గతంలోనే సౌజన్య కొన్ని నాట్య ప్రదర్శనలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి పవన్ రాకతో ఆ నృత్య ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణ వెలువడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తనికెళ్ల భరణి, వసంత లక్ష్మీ నరసింహాచారి, త్రివిక్రమ్ శ్రీనివాస్, చుక్కపల్లి సురేష్, సతీష్ చంద్ర గుప్తా వంటి ప్రముఖులు కూడా రాబోతున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమా కోసం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు కూడా త్రివిక్రమ్ మాటలు అందిస్తు దర్శకత్వ పర్యవేక్షకుడిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus