Pawan Kalyan: అనుకున్న డేట్‌ వచ్చేస్తా అంటున్న భీమ్లా!

పొడవాటి జుట్టు, చిన్నపాటి గడ్డంతో మొన్నీ మధ్య ముచ్చింతల్‌ వెళ్లినప్పుడు పవన్‌ కనిపించాడు. భలే ఉన్నాడు పవన్‌ అంటూ అభిమానులు మురిసిపోయారు. అక్కడి రెండు, మూడు రోజులకు గడ్డం తీసేసి నీట్‌గా మారిపోయాడు. పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పవన్‌ లుక్‌ ఇది. గడ్డం లుక్‌ ‘హరి హర వీరమల్లు’ కోసం రెడీ అవ్వడానికి అన్నారు. మరి ఈ అత్యవసర ఛేంజ్‌ ఎందుకు అనే డౌట్ మీకొచ్చిందా? చాలామంది ఇదే డౌట్‌. ఎందుకా? అని ఆరా తీస్తే… ‘భీమ్లా నాయక్‌’ కోసం అని తెలుస్తోంది.

Click Here To Watch

‘భీమ్లా నాయక్‌’కి సంబంధించి చాలావరకు షూటింగ్‌ పూర్తయిపోయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి అని ఈ మధ్య వరకు వార్తలొచ్చాయి. అయితే సినిమాకు ఇంకా రెండు రోజుల షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉందట. ఇంట్రడక్షన్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలు తీయాల్సి ఉందట. దీంతో పవన్ మళ్లీ ఆ షూట్‌లోకి వచ్చారు అని చెబుతున్నారు. నిజానికి సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమాను వాళ్లు చెప్పినట్లే ఏప్రిల్‌ 1కి తీసుకెళ్తారు అన్నారు.

అయితే టికెట్‌ ధరలు, నైట్‌ కర్ఫ్యూ తదితర అంశాల మీద ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమకు అనుకూలంగా ఈ మార్పులు ఉంటాయని అంటున్నారు. దీంతో ‘భీమ్లా నాయక్‌’ను ఫిబ్రవరి 25న విడుదల చేసేయాలని చూస్తున్నారట. బ్యాలెన్స్‌ షూట్‌ పూర్తి చేసి ప్రచారం మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. దీంతో దర్శకుడు సాగర్‌ కె.చంద్ర, త్రివిక్రమ్‌, పవన్‌… ఇలా మొత్తం టీమ్‌ ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారట.

ఈ సినిమా విడుదలయ్యాక ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ను పూర్తి స్థాయిలో మొదలు పెట్టాలని చూస్తున్నారట. మరి ఏపీ ప్రభుత్వం ఏమంటుంది, అనుకూల నిర్ణయం వస్తుందా, ‘భీమ్లా నాయక్‌’ విడుదల చేసేస్తారా అనేది ఈ రోజు, లేదంటే రేపు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజు ఏపీ సీఎం బృందాన్ని టాలీవుడ్‌ బృందం కలవనున్న విషయం తెలిసిందే.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus