Pawan Kalyan: అక్కడ స్థలం కొన్న పవన్.. ఖరీదెంతంటే?

తెలుగులో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరనే సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొన్ని సినిమాలకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ తో సినిమాలను నిర్మించడానికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు.

తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు సహాయం చేయడం కొరకు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ స్టార్ హీరో హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియాలో 1200 గజాల స్థలం కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది. పవన్ కొనుగోలు చేసిన స్థలం విలువ 24 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్ లోని కాజాగూడ ప్రాంతంలో పవన్ ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని బోగట్టా.

పవన్ ఈ స్థలంలో ఏం నిర్మిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అయినప్పటికీ సింపుల్ గా జీవించడానికి ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ప్రముఖ స్కూల్ కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది. గతేడాది వకీల్ సాబ్ తో ఈ ఏడాది భీమ్లా నాయక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.

పవన్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు వినోదాయ సిత్తం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. వినోదాయ సిత్తం రీమేక్ స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ మార్పులు చేయగా సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో మరో హీరోగా కనిపిస్తారని తెలుస్తోంది. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus