పవన్ కళ్యాణ్ సముద్రఖని కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు ఓటీటీలో సైతం హిట్ గా నిలిచింది. తాజాగా బుల్లితెరపై బ్రో మూవీ ప్రసారం కాగా బుల్లితెరపై ఈ సినిమా అదిరిపోయే రేటింగ్ ను సొంతం చేసుకుంది. బుల్లితెరపై ఈ సినిమాకు 7.24 రేటింగ్ రావడం గమనార్హం. బుల్లితెరపై చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ సినిమాకు రేటింగ్ రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగులో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం గమనార్హం. బ్రో సినిమా సక్సెస్ తో తెలుగులో సముద్రఖని మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. కేతిక శర్మ, రోహిణి, ప్రియా ప్రకాశ్ వారియర్ (BRO Movie) ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పవన్ బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతుండగా వచ్చే ఏడాది అయినా ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందేమో చూడాలి. ఈ సినిమా వల్ల నిర్మాత రత్నంపై వడ్డీల భారం పెరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 60 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. 2024 ఎన్నికల సమయానికి పవన్ సినిమాలలో ఒక సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో పవన్ సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ రేంజ్ పెరుగుతుండటం గమనార్హం.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!