Pawan, Chiru: అన్ స్టాపబుల్ లో చిరు గురించి పవన్ అలా చెప్పారా?

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో పవన్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా టాక్ షోలపై పెద్దగా ఆసక్తి చూపని పవన్ కళ్యాణ్ బాలయ్యపై ఉన్న గౌరవం, ఇతర కారణాల వల్ల ఈ టాక్ షోకు హాజరయ్యారనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ లో పవన్ చెప్పిన విషయాలు ఇవేనంటూ కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోదరుడు చిరంజీవి నుంచి తాను కష్టపడే స్వభావాన్ని నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ ఈ షోలో వెల్లడించారని సమాచారం అందుతోంది. ఆ క్వాలిటీ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని పవన్ చెప్పారని బోగట్టా. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇప్పటికే సక్సెస్ కాగా రాజకీయాల్లో కూడా సక్సెస్ కావాలని చిరంజీవి కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

రాజకీయాలకు సంబంధించి ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా పవన్ కళ్యాణ్ ముందడుగులు వేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే 2024లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలకు సంబంధించి పవన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేన ఏపీలో బలోపేతం అయ్యే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండగా

హరిహర వీరమల్లు షూట్ పూర్తైన తర్వాతే పవన్ కొత్త సినిమాల షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. త్వరలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఇటు సినిమాలలో అటు రాజకీయాలలో సక్సెస్ అయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus