Pawan Kalyan: మీరు తగ్గితే మాకు నచ్చదని హరీశ్ అన్నారు.. పవన్ కామెంట్స్ వైరల్!
- March 20, 2024 / 03:09 PM ISTByFilmy Focus
ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా నుంచి తాజాగా రిలీజైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ వీడియోకు 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ గ్లింప్స్ గురించి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తూ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక వ్యక్తి గాజు గ్లాస్ కింద పడేస్తాడని అది ముక్కలవుతుందని ఈ సీన్ ఎందుకు రాశావని హరీశ్ శంకర్ ను (Harish Shankar) అడిగానని పవన్ కామెంట్లు చేశారు.
ఆ సమయంలో హరీష్ శంకర్ అందరూ మీరు ఓడిపోయారని అంటున్నారని వాళ్లందరికీ నేను ఒక్కటే చెబుతున్నానని గాజుకు ఉన్న లక్షణం ఏంటంటే పగిలేకొద్దీ పదునెక్కుతుందని మీ నుంచి మేము ఇలాంటివి కోరుకుంటామని మీరు తగ్గితే మాకు నచ్చదని చెప్పారని పవన్ వెల్లడించారు. సాధారణంగా సినిమాలలో ఇలాంటి డైలాగ్స్ చెప్పడం తనకు నచ్చదని హరీష్ శంకర్ బాధ పడలేక ఆ డైలాగ్ చెప్పానని పవన్ పేర్కొన్నారు.

పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కాగా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కనిపించనున్నారు. తెరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నా ఒరిజినల్ వెర్షన్ తో పోల్చి చూస్తే మేకర్స్ ఎన్నో మార్పులు చేశారని తెలుస్తోంది. పవన్ అభిమానులకు విందు భోజనంలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. పవన్, హరీష్ ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ నిర్మాతలు ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతమయ్యాయి. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు డిజిటల్ హక్కులను సైతం అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

















