వినోద్ కుటుంబాన్ని ఓదార్చిన పవన్!
- August 25, 2016 / 06:41 AM ISTByFilmy Focus
తన వీరాభిమాని వినోద్ కుటుంబాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం పరామర్శించారు. మూడు రోజుల క్రితం కర్ణాటకలోని కోలార్ లో జరిగిన గొడవలో తిరుపతికి చెందిన వినోద్ కత్తి పోటుకి గురై మరణించాడు. వినోద్ అవయవ దానం పై విస్తృత ప్రచారం కల్పించేవాడు. పవన్ పిలుపుమేరకు పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవాడు. త్వరలో విదేశాలకు వెళ్లవలసిన కొడుకును పోగొట్టుకోవడంతో ఆ తల్లిదండ్రులు విచారంలో మునిగిపోయారు.
తిరుపతికి వెళ్లి వినోద్ పేరెంట్స్ ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ఓదార్చారు. పవన్ ని చూడాగానే వినోద్ తల్లి కన్నీరు పెట్టుకుంది. కొడుకుని చంపిన వాణ్ని కఠినంగా శిక్షించాలని వేడుకుంది. ఆయనకు రాఖీ కట్టి అన్నా అని పిలిచింది. జనసేన పార్టీని పెట్టినప్పుడు తన కొడుకు వినోద్ ఎంతో సంతోషించాడని చెప్పింది. పవన్ తో వినోద్ తల్లిదండ్రులతో పాటు అతని సోదరుడు, సోదరి కూడా మాట్లాడారు. ఎంతో సున్నితమైన అంశం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

















