పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా గతేడాది కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో విడుదలై దాదాపుగా 90 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. వకీల్ సాబ్ సినిమా సక్సెస్ తో పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో పవన్ ఖాతాలో మరో హిట్ చేరింది. స్టార్ హీరోలంతా ఒక్కో సినిమాను పూర్తి చేయడానికి కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటుంటే పవన్ మాత్రం పది నెలల గ్యాప్ లో రెండు సినిమాలను పూర్తి చేసి విడుదల చేశారు.
వీరమల్లు సినిమా కూడా త్వరలో రిలీజ్ కానుండగా పవన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్రిష్ పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా దాదాపుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా ఈ సినిమాలో పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. కెరీర్ తొలినాళ్లలో పవన్ వరుసగా ఆరు హిట్లను సొంతం చేసుకున్నారు.
అయితే తర్వాత కాలంలో పవన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సాధించడంలో ఫెయిలయ్యారు. హరిహర వీరమల్లు సినిమాతో దర్శకుడు క్రిష్ సైతం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఎ.ఎం.రత్నం ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రీఎంట్రీలో వరుస విజయాలతో పవన్ కళ్యాణ్ సక్సెస్ రేట్ ను పెంచుకుంటూ ఉండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు కూడా టాలెంటెడ్ డైరెక్టర్లు పని చేస్తుండగా ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా హీరోగా పవన్ మరింత ఎదగాలని అభిమానులు భావిస్తున్నారు. ఫుల్ రన్ లో భీమ్లానాయక్ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.