Bro Movie: బ్రో ట్రైలర్ పై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే.. మరో బ్లాక్ బస్టర్ అంటూ?

పవన్ సాయితేజ్ కాంబో మూవీ అయిన బ్రో నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ పవన్ ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చేసింది. 2 నిమిషాల 15 సెకన్ల ట్రైలర్ ను పవన్ ఫ్యాన్స్ కు నచ్చేలా, మెచ్చేలా కట్ చేశారు. కథ గురించి కొంతమేర రివీల్ చేస్తూనే పవన్ సినిమా అంటే ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పకనే చెప్పేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ వల్ల ఈ సినిమా రీమేక్ అయినా ఆ ఫీల్ ను అయితే కలిగించలేదు.

టైం గురించి అటు పవన్ ఇటు సాయితేజ్ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ షాట్స్ కు థమన్ బీజీఎం అదరగొట్టారు. పవన్ కళ్యాణ్ స్టైల్, మేనరిజం కోసమే ఈ సినిమా చూస్తామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బ్రో సినిమా బుకింగ్స్ మొదలైతే ఫస్ట్ డే టికెట్లు దొరకడం కష్టమని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కాకపోయినా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ వసూళ్లను సొంతం చేసుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ సైతం ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉండగా కష్టపడి పైకి వచ్చిన పవన్, సాయితేజ్ లను ఒకే ఫ్రేమ్ లో చూడటం సంతోషంగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. భారీ బ్లాక్ బస్టర్ బ్రో అంటూ పవన్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో (Bro Movie) ప్రధానంగా జీవితం విలువ గురించి చెప్పనున్నారు. మరోవైపు సాయితేజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒక సినిమా క్యాన్సిల్ అయిందని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వింటేజ్ పీకే ఈజ్ బ్యాక్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో ఈ సినిమాలో అదే విధంగా చూపించనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus