Pawan Kalyan, Ali: అలీపై విమర్శలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ అలీ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి పవన్ అభిమానులతో పాటు సాధారణ ఫ్యాన్స్ కు కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం వరకు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమాలో అలీ కనిపించారు. అయితే అలీ వైసీపీలో చేరిన తర్వాత పవన్, అలీ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. పవన్ కు, తనకు విభేదాలు లేవని అలీ చెబుతున్నా వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి.

తాజాగా అలీ పవన్ పై పోటీకి సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. వైసీపీ నిర్ణయిస్తే ఎక్కడినుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని అలీ ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణం అని అలీ కామెంట్లు చేశారు. తనపై ఎవరైనా విమర్శలు చేస్తే రోజా అస్సలు తగ్గరని ఆవిడ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసని అలీ చెప్పుకొచ్చారు.

పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమేనని అలీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అలీ ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. సినిమాలు వేరని పాలిటిక్స్ వేరని అలీ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన కామెంట్లు చేశారు. జగన్ ఆదేశాల ప్రకారం తాను 2024 ఎన్నికల సమయంలో ముందుకు వెళతానని అలీ అభిప్రాయపడ్డారు. అయితే పవన్ అభిమానులు మాత్రం అలీని ట్రోల్ చేస్తున్నారు.

పవన్ అలీ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ ను బాధిస్తోంది. ప్రస్తుతం అలీ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. భవిష్యత్తులో పవన్ సినిమాలలో అలీ కనిపించడం కష్టమేనని కొంతమంది చెబుతున్నారు. పవన్ పై పోటీ చేయాలని అలీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని నెటిజన్లు చెబుతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus