పవన్ కల్యాణ్ సినిమాల ఫ్లాప్ ఎఫెక్ట్ ఆ సినిమా వరకే ఉంటుంది. మళ్లీ కొత్త సినిమా స్టార్ట్ చేస్తే.. అందరి చూపు దాని మీదకు వెళ్లిపోతుంది అంటుంటారు. ఆయన కెరీర్‌లో ఇలా చాలాసార్లు జరిగింది. అందుకు తగ్గట్టుగానే పవన్ కొత్త సినిమా అనగానే ప్రేక్షకులు, అభిమానులు అలానే థియేటర్లకు వచ్చేస్తుంటారు. దీంతో నిర్మాతలు పవన్ మీద భారీగా పెట్టుబడి పెడుతుంటారు. అలానే గట్టిగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పుతుంటారు. ‘అజ్ఞాతవాసి’ లాంటి ఫ్లాప్, ఆ తర్వాత వచ్చిన గ్యాప్… పవన్ ప్రజెంట్ రెమ్యూనరేషన్ మీద అస్సలు ప్రభావం చూపించడం లేదంటే నమ్ముతారా?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘పింక్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంగానే, క్రిష్ సినిమా మొదలుపెట్టేశాడు. ‘అయ్యప్పన్ కొషియమ్’ రీమేక్ త్వరలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాను ఓకే చేసేశాడు. సురేందర్ రెడ్డి సినిమా కూడా లైన్‌లో ఉంది. ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలోనూ పవన్ సినిమా చేస్తాడనే వార్తలూ వస్తున్నాయి. దీంతో పవన్ మొత్తంగా ఆరు సినిమాలు ఓకే చేసినట్లయింది. వీటితో పవన్ ఏకంగా ₹300 కోట్ల నుంచి ₹400 కోట్ల వరకు అందుకుంటున్నాడట.
‘అజ్ఞాతవాసి’ సమయంలో పవన్‌కు సినిమాకు ₹40 కోట్ల నుంచి ₹50 కోట్ల మధ్యలో వచ్చేదట. అయితే ప్రస్తుతం సినిమాకు ₹50 కోట్ల నుంచి ₹55 కోట్లు అందుతోందట. ఆ లెక్కన పవన్ తన తర్వాతి ఆరు సినిమాలకు తీసుకునే మొత్తం కనీసం ₹300 కోట్లు అందుకుంటున్నట్లే కదా. రీఎంట్రీలో పవన్ ఈ రేంజీలో మూటగట్టుకోవడం మామూలు విషయం కాదు.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!