Pawan Kalyan: పవన్ డైరెక్టర్ల ఈ సెంటిమెంట్ గురించి తెలుసా?

కొన్నేళ్ల క్రితం వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిదానంగానే సినిమాల్లో నటించారు. అయితే రీఎంట్రీలో మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో వేగం పెంచడంతో పాటు ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల సక్సెస్ లతో జోరుమీదున్న పవన్ కళ్యాణ్ వినోదాయ సిత్తం రీమేక్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. అయితే టాలీవుడ్ డైరెక్టర్లలో కొంతమంది డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ తో కెరీర్ లో మూడో చిత్రాలను తెరకెక్కించి విజయాలను అందుకున్నారు.

శుభమస్తు సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన భీమినేని శ్రీనివాసరావు రెండో సినిమాగా శుభాకాంక్షలు సినిమాను తెరకెక్కించి సక్సెస్ ను అందుకున్నారు. భీమినేని మూడో సినిమా పవన్ హీరోగా సుస్వాగతం పేరుతో తెరకెక్కి సక్సెస్ సాధించింది. కోలీవుడ్ స్టార్ యాక్టర్, డైరెక్టర్ ఎస్.జె.సూర్య వాలి సినిమాతో దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టి తమిళంలో ఖుషి సినిమాను రెండో మూవీగా తెరకెక్కించారు. ఎస్.జె.సూర్య మూడో సినిమాగా పవన్ హీరోగా తెలుగులో ఖుషి సినిమా తెరకెక్కి సంచలన విజయం సాధించింది.

నువ్వే నువ్వే సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమాతో మరో కమర్షియల్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ దర్శకుని డైరెక్షన్ లో పవన్ హీరోగా మూడో సినిమాగా తెరకెక్కిన జల్సా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. షాక్ మూవీతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన హరీష్ శంకర్ మిరపకాయ్ సినిమాతో సక్సెస్ సాధించారు. హరీష్ మూడో సినిమా పవన్ హీరోగా గబ్బర్ సింగ్ పేరుతో తెరకెక్కి కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకుంది.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన డాలీ రెండో సినిమాగా తడాఖా సినిమాతో సక్సెస్ సాధించారు. ఈ దర్శకుడి మూడో సినిమా గోపాల గోపాల పేరుతో పవన్, వెంకటేష్ హీరోలుగా తెరకెక్కింది. ఓ మై ఫ్రెండ్ సినిమాతో వేణు శ్రీరామ్ దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టగా రెండో సినిమా ఎంసీఏతో ఈ దర్శకునికి సక్సెస్ సొంతమైంది.

మూడో సినిమా వకీల్ సాబ్ ను పవన్ తో తెరకెక్కించి వేణు శ్రీరామ్ హిట్ అందుకున్నారు. తాజాగా పవన్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై సక్సెస్ సాధించింది. ఈ సినిమా కూడా దర్శకుడు సాగర్ కె చంద్రకు మూడో సినిమా కావడం గమనార్హం. ఈ సినిమాలలో జల్సా మినహా మిగిలిన సినిమాలన్నీ రీమేక్ సినిమాలు కావడం విశేషం. దర్శకుల కెరీర్ లో పవన్ హీరోగా మూడో సినిమాగా తెరకెక్కిన సినిమాలన్నీ సక్సెస్ సాధించడం గమనార్హం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus