Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్, అకీరా ఫోటోలు వైరల్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
- June 6, 2024 / 08:16 PM ISTByFilmy Focus
ఏపీ ఎన్నికల్లో కూటమి అదుర్స్ అనిపించే ఫలితాలతో సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలో విజయం సాధించి వార్తల్లో నిలిచింది. జనసేనకు ప్రజల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభించడంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాజాగా ఎన్డీయే కూటమి నేతల సమావేశం జరగగా పవన్ తన ఫ్యామిలీతో కలిసి ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సమావేశానికి పవన్ తో పాటు పవన్ భార్య అన్నా లెజినోవా, కొడుకు అకీరా నందన్ సైతం హాజరయ్యారు.
అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా మోదీ ఏదో చెప్పగా పవన్, అన్నా లెజినోవా ఫక్కున నవ్వారని తెలుస్తోంది. మోదీ పవన్, అకీరాతో మాట్లాడుతున్న ఫోటోలు సైతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్, అకీరా కలిసి కనిపించడం గమనార్హం. చిన్న వయస్సులోనే అకీరా పీఎంను కలిసే స్థాయికి చేరారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి గతంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే సినిమాల్లోకి రావడం, రాకపోవడం అకీరా ఇష్టమని తెలుస్తోంది. అకీరా పవన్ తో కలిసి తరచూ కనిపిస్తున్న నేపథ్యంలో అకీరాకు రాజకీయాలపై ఆసక్తి ఉందో లేదో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అకీరా లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండటం కూడా ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అకీరా నందన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అతనికి ఏ రంగంలోనైనా తిరుగుండదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్, పవన్ అభిమానుల సపోర్ట్ అకీరాకు ఎంతో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అకీరా మల్టీ టాలెంటెడ్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలతో మరింత ఉత్సాహంతో త్వరలో షూటింగ్స్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్లను అందుకుని పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

















