నిహారిక పెళ్లి కుదరడానికి అంత తతంగం నడిచింది

  • June 22, 2020 / 05:55 PM IST

నిహారిక పెళ్లి అంశం కొన్నాళ్లుగా నలుగుతుండగా…కావోయేవాడిని పరిచయం చేసి నిహారిక షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో కోబోయే వాడితో ఆమె ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఎవరు, ఏమిటీ అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. నిహారిక ఫోటోలు పంచుకున్న సాయంత్రానికి అబ్బాయి పూర్తి వివరాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ అబ్బాయి ఊరు…పేరు.. కుటుంబ నేపథ్యం వంటి అన్ని వివరాలు బయటికి తెలిశాయి. ఇక గుంటూరుకి చెందిన వెంకట చైతన్య జొన్నలగడ్డ, ఐ జి ప్రభాకర్ రావు కుమారుడు.

ఇక ఈ కుర్రాడు బిట్స్ పిలానీలో చదువు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఆగస్టులో నిశ్చితార్ధం జరుపుకోనున్న ఈ జంట.. వచ్చే ఏడాది వేసవిలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా మరి ఈ సంబంధం ఎలా కుదిరింది…దాని నేపథ్యం ఏమిటీ అనే విషయాలలోకి వెళితే కొన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగు చూశాయి. చైతన్య కుటుంబానికి మెగా ఫ్యామిలీతో ఎప్పటి నుండో సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. వీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కూడా తెలుస్తుంది.

మరో ఆసక్తి కర విషయం ఏమిటంటే నిహారికకు జోడిగా చైతన్యను ఎంచుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందట. పవన్ అబ్బాయి గుణగణాలు సర్టిఫై చేసి, ఒకే చేసిన తరువాతే పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారట. 2017 నుండే నిహారిక మరియు చైతన్యలకు పరిచయం ఉంది.. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10


Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus