Pawan Kalyan, Renu Desai: పవన్ కళ్యాణ్ కు పుత్రోత్సాహం.. అకిరాతో స్పెషల్ ఫొటో!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా అతనికి స్టార్ హీరో అయ్యే అవకాశం ఉంటుంది అని అభిమానుల్లో ఒక బలమైన నమ్మకం ఉంది. అయితే అకీరా నందన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏం చదువుతున్నాడు అనే విషయాలు తెలుసుకోవాని చాలామందిలో ఆసక్తి ఉంటుంది. ఇక రీసెంట్ గా రేణుదేశాయ్ తనయుడు స్కూల్ డేస్ ముగిసిపోయినట్లూ వివరణ ఇచ్చారు.

ఇప్పటికే 18 ఏళ్ళ వయసులో ఉన్న అఖిరా నందన్ బెంగుళూరులో తన స్కూలింగ్ చదువును పూర్తి చేశాడు. అక్కడే తల్లితో పాటు సంగీతం బాక్సింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక అకిరా నందన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే రోజు పక్కపక్కనే తల్లిదండ్రులు కూడా ఉండడం విశేషం. రేణు దేశాయ్ నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నప్పటికీ కూడా తండ్రిగా మాత్రం పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను ఏ మాత్రం మరచిపోలేదు.

ఇక సోషల్ మీడియాలో ఆమె కొడుకు గ్రాడ్యుయేషన్ గురించి ఫన్నీగా వివరణ ఇచ్చారు. ఇక ఫొటోలో పవన్ కళ్యాణ్ పుత్రోత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ తో మంచి సాన్నిహిత్యంతోనే ఉంటోంది. ఇక వీరు విడాకుల విషయాన్ని మర్చిపోయి పిల్లలకు మాత్రం మంచి తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. అకిరా నందన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో అతను తదుపరి స్టెప్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అతను టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని చాలామంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

అందరికంటే ఎక్కువ ఎత్తు ఉన్న హీరోగా కూడా అకిరా నందన్ క్రేజ్ అందుకునే అవకాశం ఉంటుంది. గతంలో అయితే అకిరా నందన్ ఎంట్రీపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అతను ఇంకా అందుకు సిద్ధం కాలేదని అకిరా ఎలాంటి కెరీర్ ను ఎంచుకోబోతున్నాడు అనేది అతని ఇష్టం అని కూడా ఆమె వివరణ ఇచ్చారు. ఇక అకిరా నందన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో కాలమే సమాధానం ఇవ్వాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus