Pawan Kalyan: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పవర్‌స్టార్‌ పిక్‌!

కొన్ని ఫొటోలకు క్యాప్షన్‌ అక్కర్లేదు. మనం ఈ మాట చాలాసార్లు వినే ఉంటాం. అలాగే కొన్ని ఫొటోలు వైరల్‌ అవ్వడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి చాలు. అలాంటి ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అందులో ఉన్నది పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్. ఆయనతోపాటు ఉన్నది అతని తర్వాతి సినిమాల దర్శకులు. ఈ ఫొటోను మీరు ఇప్పటికే చూసే ఉంటారు. దర్శకుడు క్రిష్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేశారు.

Click Here To Watch

మధ్యలో పవన్‌ కల్యాణ్‌ అటు ఇటు ఇద్దరు యువ దర్శకులు. ఫొటో అయితే చూడటానికి సూపర్‌గా ఉంది. దీంతో అభిమానులు తెగ లైక్‌ చేసేస్తున్నారు. పవన్‌ తిరిగి షూటింగ్‌లో బిజీ అయిపోవడంతో ఇప్పటికే ఆనందంగా ఉన్న ఫ్యాన్స్‌… ఈ ఫొటో చూసి వాట్‌ ఏ పిక్‌ అంటూ మురిసిపోతున్నారు. ఓవైపు ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ దర్శకు హరీశ్‌ శంకర్‌, మరోవైపు ‘హరి హర వీరమల్లు’ దర్శకుడు క్రిష్‌ ఆ ఫొటోలో ఉన్నారు. మధ్యలో ఉన్న ‘భీమ్లా నాయక్‌’ అవతారంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌. దీనికి క్రిష్‌ ‘భవదీయుడు హరిహర భీమ్లా నాయక్‌’ అనే క్యాప్షన్‌ పెట్టారు.

పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్‌’, ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌ మీద పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమాను స్టార్ట్‌ చేస్తారు. ‘భీమ్లా నాయక్‌’ షూటింగ్‌ చివరి దశకొచ్చింది. ఈ క్రమంలోనే ఆ సినిమా సెట్‌లో ఇద్దరు దర్శకులతో పవన్‌ కల్యాణ్‌ ఆ ఫొటో దిగినట్లు అర్థమవుతోంది. ‘భీమ్లా నాయక్‌’ సినిమా షూటింగ్‌లో పాట మాత్రమే బ్యాలెన్స్‌ ఉందని, అది కూడా పూర్తి చేశారని వార్తలొచ్చాయి. అయితే ఈ ఫొటో కొత్తదా లేక పాతదా అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు పవన్‌ కల్యాణ్ ‘భీమ్ల నాయక్’ డబ్బింగ్‌ కూడా పూర్తి చేశారని టాక్‌. ఫిబ్రవరి 25న సినిమా విడుదల చేస్తున్నామని ఇటీవల నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే సినిమా ప్రచారం మొదలుపెట్టలేదు. దీంతో సినిమా రిలీజ్‌ డేట్‌ మారుతుందా అంటూ చర్చలు జరుగుతున్నాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus