ఇండస్ట్రీలో నెపో కిడ్స్, వారసత్వం అంటూ.. వారసుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే వారసులకు రాణించడం అంత సులభమా అంటే.. కాదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ల మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అలా టాలీవుడ్‌లో వారసత్వంతో వచ్చి తనకుంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నాడు పవన్ కల్యాణ్. అయితే ఈ క్రమంలో తన అన్నయ్య చిరంజీవి నుండి నేర్చుకున్న విషయాలు ఎలా ఉపయోగపడ్డాయో చెప్పుకొచ్చాడు పవన్. సినిమాల్లో ఒళ్లు దాచుకోకుండా కష్టపడేతత్వాన్ని అన్నయ్య చిరంజీవి నుండి అలవాటు చేసుకున్నాను అని చెప్పాడు పవన్.
అంతేకాదు పాలిటిక్స్‌లో విమర్శను స్వీకరించాలి అనే మాటను కూడా చిరంజీవి జీవితం నుండి నేర్చుకున్నవే అని పవన్ చెప్పాడు. సద్విమర్శ వల్ల మనలోని లోపాలేంటో తెలుసుకుని, సరి చేసుకునే అవకాశం ఉంటుంది అని అన్నయ్య చెప్పేవారు అని పవన్ తెలిపాడు. అయితే అన్నయ్య నుండి తీసుకోనిది ఏదైనా ఉందంటే అది మొహమాటం అని చెప్పాడు. సినిమాల్లో అభిమానం వేరు.. ఆ అభిమానం ఓటుగా మారడం వేరు అని చెప్పాడు పవన్.
సినిమా రంగంలో అభిమానుల్ని సంపాదించుకుని.. టాప్ ప్లేస్‌లోకి వెళ్లాలంటే దశాబ్దాలపాటు కృషి చేయాలి. సినీ పరిశ్రమలో పేరున్న వ్యక్తి రాజకీయ రంగంలోకి ప్రవేశించి.. అంతటి నమ్మకం పొందాలంటే అంతే సమయం పడుతుంది. రాత్రికి రాత్రే ఎప్పుడూ అద్భుతాలు జరగవు అని తను ఎందుకు గత ఎన్నికల్లో గెలవలేదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు పవన్. ఇక తన దృష్టిలో రాజకీయాలు అంటే ఏంటి అనే విషయం కూడా పవన్ చెప్పుకొచ్చాడు.
ఎక్కువమందికి అండగా ఉండేలా అధికారం ఉండాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు ఉండకూడదని కోరుకుంటుంటాను. ఆ క్రమంలో అధికారం వస్తుందో రాదో నాకు తెలియదు. నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్లడమే నాకు తెలిసిన పని. అదే చేస్తున్నా.. ఈ క్రమంలో అధికారం వస్తుందా? లేదా? అనేది తర్వాతి సంగతి అని చెప్పాడు పవన్. ఇలా అన్‌స్టాపబుల్ 2 ఫైనల్ ఎపిసోడ్ ఎక్కువగా పొలిటికల్ ఫ్లేవర్‌లో సాగింది.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!