ఒకపక్క అబ్బాయ్ రామ్ చరణ్ తన స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అరుదైన జాతి పక్షులు బహుమతిగా ఇస్తూ హీరోలందరం ఒకటే అని అభిమానులందరికీ సైలెంట్ మెసేజ్ ఇస్తూ.. నందమూరి-మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఒక్కటవ్వడానికి ప్రయత్నిస్తుంటే.. మరోపక్క బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా మళ్ళీ ఫ్యాన్ వార్స్ కి తెరలేపుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిట్రా అంటే ఇటీవల పవన్ కళ్యాణ్ తన కేడర్ మెంబర్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వ పోలీసులు ర్యాలీల సమయంలో సైలెన్సర్ లేని బైకులను పట్టుకోంటూ ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పగా..
దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ “ఈ ప్రభుత్వం సైలెన్సర్ లేని బైకులు పట్టుకోవడంలో చూపిన చొరవ.. ఇళ్ళల్లో తూటాలు పేల్చినవారిని పట్టుకోవడంలో మాత్రం చూపదు” అని చేసిన స్టేట్ మెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అప్పట్లో బాలయ్య ఇంట్లో బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశాడని తెలుస్తోంది. అయితే.. గతంలోనూ బాలయ్య “పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు” అని ఇచ్చిన స్టేట్ మెంట్ కి ఇది తిప్పికొట్టడం లాంటిదని కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుండడం విశేషం.