రాజకీయాలు, సినిమా అంటూ… రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు పవన్ కల్యాణ్. అయితే రెండిటికీ సమయం కేటాయించుకుంటూ ముందుకెళ్తున్నాను అని చెప్పొచ్చు కానీ… ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిపడింది అంటున్నారు టాలీవుడ్ పరిశీలకులు. అదే వచ్చే ఏడాదో, ఆ తర్వాతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడున్న కరోనా. అవును ఈ రెండింటి వల్ల పవన్ కల్యాణ్ లైనప్ ఇబ్బందిపడుతోందని టాక్. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక పవన్ వరుస సినిమాలు అనౌన్స్ చేశాడు. 2024 ఎన్నికల నాటి వాటిని పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ అయిపోవాలని అనుకున్నాడు.
అయితే కరోనా వచ్చి మొత్తం పరిస్థితి మారిపోయింది. అనుకున్న షెడ్యూల్, అనుకున్న టైమ్‌కి అవ్వడం లేదు. దీంతో ఏకధాటిగా సినిమాలు చేసేద్దాం అనుకున్న పవన్, ఇప్పుడు ఆగి ఆగి సినిమాలు చేయాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు ఒక్కో సినిమాకు డెడ్‌లైన్ పెట్టి మరీ సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అవును పవన్ చేతిలో ఉన్న సినిమాలకు పక్కాగా లెక్క రాసి మరీ డేట్స్ కేటాయిస్తున్నాడట. వాటి ప్రకారం సినిమా పూర్తవ్వాల్సిందే అనే నియమం పెట్టుకున్నాడట.
పవన్ చేతిలో ఉన్న సినిమాల సంగతి చూస్తే… ‘భీమ్లా నాయక్’ చిత్రీకరణ చివరిదశకొచ్చింది. కొన్ని ప్యాచ్ సీన్లు తప్ప ఇంకేమీ బ్యాలెన్స్ లేవు. ఇక ‘హరి హర వీరమల్లు’కు సంబంధించి కొంత భాగం చిత్రీకరణ సాగింది. మరో 40 – 50 రోజులు కాల్‌షీట్లు ఇస్తే సినిమా అయిపోతుంది. దీంతో తొలుత ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. త్వరలో చాందినీ చౌక్ సెట్‌లో సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం.
దీని తర్వాత పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను ప్రారంభిస్తాడట. దీనికి సంబంధించి ఇప్పటికే హరీశ్ శంకర్‌కు, మైత్రీ మూవీ మేకర్స్‌కు సమాచారం ఇచ్చాడట. ఈ సినిమాకు సుమారు 60 రోజుల కాల్‌షీట్లు ఇచ్చాడట పవన్. అలాగే సురేందర్ రెడ్డి – రామ్ తాళ్లూరి సినిమాకు కూడా అన్నే రోజులు కేటాయించాలని నిర్ణయించాడట. దీంతో దర్శకులు పక్కాగా ప్లాన్ వేసుకొని సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఎలా చేస్తారో చూడాలి.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!