Pawan Kalyan: పవన్‌ సినిమాల నిర్మాతలకు డబ్బులు నీళ్లలా

క్యాన్సిల్‌… క్యాన్సిల్‌… క్యాన్సిల్‌.. ఐ డోంట్‌ వాంట్‌ క్యాన్సిల్‌. బట్‌ క్యాన్సిల్ వాంట్స్‌ మీ. ఐ కంట్‌ అవాయిడ్‌ ఇట్‌. ఇదేదో ‘కేజీయఫ్‌ 2’ డైలాగ్‌ లా ఉంది అనుకుంటున్నారా? అవును ఆ డైలాగ్‌ స్ఫూర్తే.. కానీ ఇక్కడ ఈ డైలాగ్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా లైనప్‌కి బాగా వర్తిస్తుంది అని చెప్పొచ్చు. కారణం ఆయన సినిమాల షూటింగ్‌ వరుసగా క్యాన్సిల్స్ అవుతుండటమే. అదేంటి మొన్నేగా ఫొటోలు కూడా వచ్చాయి సెట్‌ నుండి అంటారా. వచ్చాయి సర్‌, మళ్లీ షూట్‌ వాయిదా అంటున్నారు.

ఎప్పుడూ చెప్పే పాత మాటే… పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ నడుపుతూనే, సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండింటినీ పారలల్‌గా చేయాలని చూస్తున్నా అనుకున్నట్లుగా కుదరడం లేదు. దీంతో వరుసగా కాల్‌షీట్లు క్యాన్సిల్‌ చేస్తూ వస్తున్నారట. తాజాగా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌ కూడా క్యాన్సిల్‌ అవుతోందట. రాజకీయ కార్యకలాపాల కోసం అనుకున్న రోజు షూటింగ్‌ అవ్వడం లేదని టాక్‌. నిజానికి పవన్‌ కల్యాణ్‌ లైనప్‌ చాలా బిజీగా ఉంది.

2024లో ఏపీలో ఎన్నికలు జరిగే ముందే ఆ సినిమాలు పూర్తి చేసేయాలి. దీంతో ఒక్కో సినిమాకు బల్క్‌ డేట్స్‌ ఇచ్చి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అనుకున్నట్లుగా డేట్స్‌ ఇస్తున్నారు. కానీ ఆ సమయానికి వేరే ఏదో పని పడి ఆగిపోతున్నారని టాక్‌. దీంతో ఆ రోజు షూట్‌ క్యాన్సిల్‌ చేయాల్సి వస్తోందట. పవన్‌ తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’ కోసం నగరంలో ఓ స్టూడియోలో అలనాటి సెట్‌ ఒకటి వేశారట. ఆ సెట్‌ వేసి చాలా రోజులైందని, షూటింగ్‌కి పవన్‌ రాక అలా సెట్‌ను రోజులకు మించి ఉంచుతున్నారని ఓ టాక్‌ ఇండస్ట్రీలో నడుస్తోంది.

గతంలో ‘భీమ్లా నాయక్‌’ సినిమా విషయంలోనూ ఇలా షూటింగ్‌లు క్యాన్సిల్‌ అయ్యాయట. ఇప్పుడు ‘హరి హర..’ విషయంలో అదే ఇబ్బంది పడుతున్నారట దర్శకుడు క్రిష్‌. ఇప్పటికే ఆయన ఈ సినిమాకు చాలా రోజులు వెచ్చించారు. నిర్మాత సంగతి సరేసరి. సినిమా ఆలస్యానికీ ఇదే కారణం. దసరాకో, సంక్రాంతికో అనుకోవడమే తప్ప షూటింగ్‌ సంగతి తేలక బలంగా ప్రకటించలేకపోతున్నారట.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus