Pawan Kalyan: అభిమాని లేఖకు స్పందించిన పవన్‌ కల్యాణ్‌… అందులో ఏముందంటే?

  • January 18, 2024 / 01:07 PM IST

2014లో నిలబడ్డాం, 2019లో బలపడ్డాం, 2024లో బలంగా కలబడదాం! ఇదీ జనసేన అధినేత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు ఓ అభిమాని పంపిన సందేశం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ట్విటర్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది. దానికి పవన్‌ కల్యాణ్ ఇచ్చిన సమాధానం అయితే ఫ్యాన్స్‌ను ఎమోషనల్‌ చేస్తోంది. అంతగా ఆ లేఖలో ఏముంది, పవన్‌ కల్యాణ్‌ ఏం రాశాడో మీరూ చదివేయండి. సామాజిక అంశాలు, ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజా జీవితంలోకి వచ్చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓ అభిమాని భావోద్వేగానికి గురి చేశాడు.

ఐర్లాండ్‌లో ఓడ కళాసీగా పని చేస్తున్న ఓ అభిమాని తమ సమస్యలు, వ్యవస్థ, (Pawan Kalyan) పవన్ కల్యాణ్ పోరాట పటిమ గురించి లేఖ ఓ లేఖ రాశాడు. ఆ లేఖను పవన్‌ కల్యాణ్‌కు పంపగా… దానిని ఫొటో తీసి ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశాడు జనసేనాని. ఆ లేఖను చదివిన ఫ్యాన్స్‌ పవన్‌ను అందుకే ఇంతలా అభిమానించేది అంటున్నారు. ‘‘నా ప్రియమైన జనసైనికుడి ఉత్తరం అందింది. నీ ఉత్తరం చదివిన వెంటనే గొంతు దుఖంతో పూడుకుపోయింది.

నీ మాటలతో కన్నీరు తెప్పించావు, నన్ను కార్యోన్ముఖుడిని చేశావు’’ అని ఆ లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు పవన్. ఇక ఆ లేఖలో ఏముందంటే ‘‘అన్నా.. కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణాలుగా సొంత దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్లందరికీ ఒక్కటే ఆశ’’ లేఖను స్టార్ట్‌ చేశాడు ఆ అభిమాని. ‘‘ఎక్కడో బొలీవీయా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా?

సరికొత్త గెరిల్లా వార్ ఫేర్‌ను మొదలెట్టక పోతావా? మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్ని మార్చుకోకపోతామా? 17 ఏళ్లుగా భారత్‌లో లేకపోయినా దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురుచూస్తున్న నాలాంటి వారు ‘మా కోసం నిలబడుతున్న నీ కోసం బలపడతాం’’ అని స్ఫూర్తివంతంగా రాశారు ఆ అభిమాని. ఆఖరి 2014లో నిలబడ్డాం 2019లో బలపడ్డాం 2024లో బలంగా కలబడదాం! అని నినాదం ఇచ్చారు.

https://twitter.com/PawanKalyan/status/1747677440078672281

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus