పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ బాగా వస్తున్నాయి అని ట్రేడ్ పండితుల సమాచారం. ఓ పెద్ద సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. పైగా లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి.. మరో 3 రోజుల పాటు ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
అందుకే ఈ 3 రోజులు క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఇందులో భాగంగా ఆయన స్పీచ్ ఇచ్చే క్రమంలో తన అభిమానులను, జనసేన ఫాలోవర్స్ ను డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పవన్ నోటి నుంచి వచ్చిన కొన్ని పదాలను కొంతమంది వక్రీకరిస్తున్నారు.
అసలు పవన్ ఏమన్నారు అంటే…”అభిమానులు దయచేసి ట్రోలింగ్ ను ఎక్కువ పర్సనల్ గా తీసుకోకండి. ఈజీగా ఉండండి. మనసు తేలిక చేసుకోండి. నేను ఎలాగూ దెబ్బలు తింటున్నాను. మీకు ఎందుకు నొప్పి. మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయండి.సోషల్ మీడియాలో వచ్చే ప్రతి నెగిటివ్ కామెంట్ కు మీరు రియాక్ట్ అవ్వకండి. నలిగిపోకండి..! మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి. ఎలా దాడి చేయాలో అలా చేయండి. నెగిటివ్ యాస్పెక్ట్స్ వద్దు” అంటూ పవన్ పలికారు. ఇక్కడ ‘మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి. ఎలా దాడి చేయాలో అలా చేయండి’ అనడం ప్రత్యర్థులకు ఛాన్స్ ఇచ్చినట్లు అయ్యింది. పవన్ పలికిన మాటలు తప్పే. కానీ ఆయన ఇంటెన్షన్ అది కాదు. గతంలో ‘వారాహి’ వాన్ రిజిస్ట్రేషన్ విషయంలో పవన్ తెలివిగా వ్యవరించి ప్రత్యర్థులను ఫూల్స్ ను చేశారు. కానీ తర్వాత దాని గురించి పవన్ గొప్పగా చెప్పుకున్నది లేదు. అభిమానులను కూడా అలా తెలివిగా ఏదైనా చేసి సైలెంట్ గా ఉండండి అనేది పవన్ ఉద్దేశం. కానీ అంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.